Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-02 01:40 GMT
Live Updates - Page 4
2020-11-02 03:54 GMT

Tirupati Updates: రేణిగుంటలో క్షుద్రపూజలు అంటూ కలకలం..

తిరుపతి..

-రేణిగుంట హిందూ స్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట‌ సమయంలో క్షుద్రపూజలు జరిగాయి అంటూ పుకార్లు.

-ఒక్కసారిగా ఉలిక్కి పడిన రేణిగుంట గ్రామ ప్రజలు.

-స్మశాన వాటికలో ఉప్పు కుంకుమ, నిమ్మకాయలు, వంటి పూజ సామాగ్రితో ఈ క్షుద్ర పూజలు‌.

-దిష్టి తీసుకునేందుకు అలా చేసారు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు.

2020-11-02 03:33 GMT

Amaravati Updates: టిడ్కో ఇళ్ళపై బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలి..

అమరావతి..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ..

-టిడ్కో ఇళ్ళపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులు కేటాయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు?

-రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా పదేపదే తేదీలు ఎందుకు మారుస్తున్నారు?

-కేవలం 4 వేల ఎకరాలపైనే కోర్టులో వివాదాలు ఉన్నాయి.

-మిగిలిన 39 వేల ఎకరాల లో ఇళ్ల స్థలాలను ఎందుకు పంపిణీ చేయడం లేదు?

-దీపావళిలోగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

2020-11-02 03:26 GMT

Amaravati Updates: విద్యా రంగంలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష..

అమరావతి..

-విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.

-11గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి,

2020-11-02 03:09 GMT

Vijayawada Updates: బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ..

  విజయవాడ..

- ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ.

- ఆయా జిల్లాలలో చైర్మన్, డైరెక్టర్లను అభినందించి సన్మానించనున్న జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు.

- డైరెక్టర్,చైర్మన్ల అభినందన సభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొననున్న జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,ఎంపీలు.

- తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరగనున్న కార్యక్రమం

2020-11-02 03:06 GMT

KurnoolDistrict Updates: నంద్యాల విజయ పాల డైరీ ఛైర్మన్ పదవి వివాదం..

 కర్నూలు జిల్లా

- భూమా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం..

- తమకే ఛైర్మన్ పదవి దక్కాలంటున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆయన బావ భార్గవ్ నాయుడు...

- మళ్ళీ ఛైర్మన్ పీఠం తమదేనంటున్న ప్రస్తుత ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి...

- ఈ రోజు బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో గత రాత్రి నంద్యాల శివ సాయి గార్డెన్స్ వద్ద ఇరువర్గాల వాగ్వాదం..

- పరిస్థితి ని చక్క దిద్దిన పోలీసులు..

- బోర్డు మీటింగ్ సజావుగా సాగేనా అంటున్న డైరెక్టర్ లు

2020-11-02 02:41 GMT

Amaravati Updates: నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్...

 అమరావతి....

* బీసీ కార్పోరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభలో పాల్గొనున్నా మంత్రి అనిల్ కుమార్

* తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి స్థానిక నేతలతో కలిసి ఘాట్లను పరిశీలించనున్న మంత్రి అనిల్

* అనంతరం తుంగభద్ర పుష్కరాలు ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం.

2020-11-02 02:34 GMT

RTC Updates: నేడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం...

   ఆర్టీసీ.. 

_ మధ్యాహ్నం 2:45 కిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనున్న ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ లు..

_ తెలంగాణ ప్రతిపాదించిన చెరో లక్షా 61 వేలా కిలోమీటర్లు నడపడానికి ఆంధ్రప్రదేశ్ దాదాపు అంగీకారం...

_ ఒప్పందం అనంతరం ఏడూ నెలలుగా ఆగిపోయిన రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పునప్రారంభం...

2020-11-02 02:28 GMT

Kadapa District Updates: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గిరిని అరెస్టు చేసిన సంబేపల్లె పోలీసులు...

 కడప :

- సహకరించిన ఓ కానిస్టేబుల్ సైతం అరెస్టు....

- కోర్టులో హజరుపరచిన పోలీసులు....

- వారి వద్ద నుంచి 5 లక్షల నగదు...

- 42 గ్రాముల నకిలీ బంగారం.....

- 2 వాహానాలు స్వాధీనం

2020-11-02 02:24 GMT

Ananthapur Updates: నేటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం..

అనంతపురం:

* నేటినుంచి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ తరగతులు ప్రారంభం

* నవంబర్ 2 నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న విద్యా సంవత్సరం

* 180 రోజులు పనిచేయనున్న కళాశాలలు

* పండగల మినహా రెండో శనివారం ఆదివారం కొనసాగనున్న కళాశాలలు

2020-11-02 02:22 GMT

Indrakeeladri Updates: కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ..

 విజయవాడ

- నేడు ఇంద్రకీలాద్రి పై ఉన్న కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ

- కొండచరియలు పడకుండా పటిష్టమైన చర్యలు దిశగా అధికారుల అడుగులు

- కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్న అధికారులు

Tags:    

Similar News