Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-02 01:40 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-02 12:47 GMT

 కృష్ణాజిల్లా

- ఆపరేషన్ ముస్కాన్ లో దారుణం

- తన కూతురు మానస(10) ను వత్సవాయి పోలీసులు తీసుకెళ్లారని ఆగిన తల్లి గుండె

- తల్లి కోమరగిరి వెంకటేశ్వరమ్మ (35) గుండె పోటుతో మృతి

2020-11-02 12:44 GMT

  విజయవాడ

* కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన హైదరాబాదు బస్సులు

* నేటి నుంచీ హైదరాబాదు మరియు తెలంగాణలోని పలు ప్రాంతాలకు తిరగనున్న ఆర్టీసీ బస్సులు

* ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదరడంతో మొదలైన బస్సులు

* ప్రైవేటు కార్లు, బస్సుల రేట్ల‌ బాదుడు నుంచీ ఈరోజుతో విముక్తి

2020-11-02 12:42 GMT

 అమరావతి

// వాదనలను వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాది

// రేపు కూడా వాదనలు వినిపించనున్న పిటిషనర్ తరవు న్యాయవాది

// రాజధాని కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రానికి మార్చే అధికారం లేదన్న పిటిషనర్

// రాజధానికి సంబంధించి చట్టం చేసిన తర్వాత భూములు ఇచ్చిన వారికి హక్కులు వస్తాయన్న పిటిషనర్

// ఒక చట్టం రద్దు చేసి మరో చట్టం ఎలా చేస్తారని, అది కుదరదని కోర్టుకి తెలిపిన పిటిషనర్

// తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

2020-11-02 12:38 GMT

  అమరావతి

_ వివేకా హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను కోరిన సీబీఐ

_ తమకు ఆదేశాలు లేవని నిరాకరించిన మేజిస్ట్రేట్

_ రికార్డులు తమకు ఇచ్చేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సీబీఐ

_ విచారణ వాయిదా వేసిన హైకోర్టు

2020-11-02 12:33 GMT

 తిరుపతి..

* చిత్తూరు జిల్లా సదాశివకోన జలపాత విహార యాత్రకు వెళ్ళిన వారు క్షేమం

* నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన మొత్తం 24 మంది విహార యాత్రకు వెళ్ళారు.

* సెల్ ఫోన్ సిగ్నల్ అందకపోవడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు

* అందురు క్షేమంగా వుండడంతో పోలీసుల, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

* ట్రాక్టర్ లో తిరుపతికి తీసుకోస్తున్నారు...

2020-11-02 11:33 GMT

అమరావతి..

-విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో విషాదం పట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

-20రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరం.

-ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

-కరోనా ఏవిధంగా ప్రజల ప్రాణాలను బలిగొంటుందో, కుటుంబాలను అస్తవ్యస్థం చేసిందో, ఈ విషాదమే తార్కాణం.

-సుల్తాన్ ముసావీ కుమార్తెకు, తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

2020-11-02 11:29 GMT

గుంటూరు ః....

-మంగళగిరి మండలం కృష్టాయపాలెం రైతుల బెయిల్ పిటిషన్.

-ఇరు వర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్దానం

-తీర్పు 5 తేది కి వాయిదా...

2020-11-02 11:26 GMT

తూర్పుగోదావరి :

- ముమ్మిడివరం మం. టి కొత్తపల్లి ఆస్పత్రి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యుడు పొన్నాడ సతీష్..

- నాడు - నేడు అభివృధ్ధి నిధులు రూ. 7.40 కోట్లతో ఆస్పత్రి ఆధునీకరణ కు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్..

2020-11-02 11:22 GMT

 పశ్చిమగోదావరి జిల్లా

- నరసాపురం లో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేఖిస్తూ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన

- తమ డిమాండ్ల ను ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని హెచ్చయించిన ఐక్య కార్యాచరణ సమితి.

2020-11-02 11:02 GMT

 ప్రకాశం జిల్లా...

- చీరాల నియోజకవర్గంలో నిపందిళ్ల పల్లి లో జరిగిన ఇరువర్గాల ఘర్షణ లో

- గాయపడి మంగళగిరి మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పోందుతున్న చెరుకూరి ఏసును పరామర్శించిన YCP నాయకులు కరణం వెంకటేష్

Tags:    

Similar News