Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Visakha updates: వైసీపీ లో చేరేందుకు టీడీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నాహాలు..
విశాఖ..
- అక్టోబర్ 3 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గంటా కలిసే అవకాశం
- తన కుమారుడు రవితేజ ను వెంటబెట్టుకొని జగన్ వద్దకు వెళ్ళే ఛాన్స్
- మరో వైపు అదే రోజు తాడేపల్లికి రావాలని గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కె కె రాజు కు అధిష్టానం పిలుపు
- వైసీపీ లో చేరేందుకే గంటా ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారని ప్రచారం
- గత కొద్దికాలంగా వైసీపీ లో చేరేందుకు గంటా ప్రయత్నాలు
- గంటా రాకను వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్థారించని గంటా వర్గం
Amaravati updates: జువనైల్ జస్టిస్ యాక్ట్ కొన్ని చోట్ల సరిగా అమలుకావడం లేదు..
అమరావతి..
జస్టిస్ కె.విజయలక్ష్మి
-హైకోర్టు జువనైల్ జస్టిస్ కమిటీ మెంబర్ గా కొన్ని ఇంకా మార్పు జరగాల్సి ఉందని గమనించాం
-సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపిన దాని ప్రకారం పిల్లల మానసిక పరిస్ధితి తెలుసుకోవాలి
-పోలీసులు, ప్రభుత్వంలోని పలు శాఖలు చాలా బాధ్యతతో జువనైల్ జస్టిస్ కోసం పనిచేస్తున్నారు
-కొన్ని సంస్ధలు ఇంకా జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిజిష్టర్ కాలేదు
-పిల్లలను కుటుంబ వాతావరణంలో ఉంచేలా జువనైల్ హోమ్స్ ఉండాలి
-పిల్లలకు అభద్రత, అసౌకర్యం కలగకుండా ఉండాలి
-ప్రతీ బాలబాలికలకు కూడా అన్ని విషయాలలో పాల్గొనే హక్కు ఉంటుంది
-ఏ కుటుంబం నుంచీ వచ్చారో ఆ కుటుంబంలో తిరిగి కలిసేలా జువనైల్ జస్టిస్ యాక్ట్ మాలు ఉండాలి
-అనాధ పిల్లలను దత్తత చేయడానికి కూడా అవకాశాలు కల్పించాలి
-సైకాలజిష్టు, సైకియాట్రిష్ట్ ద్వారా వారికి మానసిక స్ధైర్యం కల్పించాలి
-ప్రతీనెలా కచ్చితంగా జువనైల్ హోమ్స్ పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి
-జువనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 39 ప్రకారం రక్తబంధం ఉన్న పిల్లలు ఒకే దగ్గర ఉంచబడాలి
-నేరం చేసినట్లుగా చెపుతున్న పిల్లలు కూడా మామూలు పిల్లలుగానే భావించి చూడబడాలి
-నేరం ఆపాదించబడిన పిల్లలను నేరస్ధులుగా చూడకూడదు
Kurnool rain updates: కోడుమూరు ,గూడూరు ,సి.బెళగల్ మండలాల్లో భారీ వర్షం..
కర్నూల్:
-కోడుమూరు, ఎమ్మిగనూరు రహదారిపై వర్కూరు వద్ద ఉప్పొంగిన తుమ్మల వాగు..
-పొంగి పారుతున్న మొండికట్టల వాగు
-తమ్మలవాగు దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుంచి నిలిచిన వాహనాల రాకపోకలు
APSRTC updates: ఆర్టీసీ బస్సులలో భౌతికదూరం నిబంధనలు తొలగింపు..
తూర్పుగోదావరి..రాజమండ్రి:
-జిల్లాలో బస్సులలో గతంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన సీట్లను పూర్తిగా పాత సీటింగ్ గా మార్పు
-నేటినుంచి రాజమండ్రి- నుంచి విశాఖకు ఏసీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
Kurnool updates: ఉలిందకొండ జాతీయ రహదారి పై పొలాల్లోంచి వస్తున్న వర్షం నీరు..
కర్నూలు జిల్లా:
-రాత్రి కురిసిన భారీ వర్షాలకు జాతీయరహదారిపై పొంగిపొర్లుతున్నా వర్షము నీరు
-రాక పోకలకు అంతరాయం,పలు కార్ల శైలేంజర్ లోకి నీరు పోవడం తో ఆగి పోయిన కార్లు
-కార్లు ఆగిపోవడంతో అగచాట్లు పడుతున్న కారు యజమానులు
Vijayawada updates: జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం!
కృష్ణాజిల్లా..
-జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకే 40 శాతం వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ పూర్తి
-లబ్ధిదారుల వద్దకే వెళ్లి పంపిణీ చేసిన వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు
Amaravati updates: రాష్ట్రంలో బాల నేరస్థులు పెరిగే విషయంలో డీజీపీ వర్క్ షాప్..
అమరావతి..
-డిజిపి గౌతమ్ సవాంగ్ కామెంట్స్
-రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే అంశాల పై డీజీపీ వర్క్ షాప్
-ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికల విషయంలో ముందుగా పోలీసులకు తెలపాలి
-పోలీసులకు జిల్లా వ్యాప్తంగా ఒంటరి బాలురు, బాలికలు వివరాలు తెలియపరచాలి
-www.trackthemissingchild.gov.in వెబ్సైట్ లో ప్రజల ఎవరైనా బాలురు, బాలికలు వివరాలు తెలియచేయొచ్చు
-వెబ్సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయిన వారి వివారులతో సరి తుగితే సదరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి
-ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదు
-ఒకవేళ బాలురు, బాలికలు నేరం చేస్తే, వారిని స్టేషనలో నేరస్థులతో ఉంచకుండా, వారితో మృదువుగా వ్యవహరించాలి
Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
కర్నూలు జిల్లా....
-6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 1,93,643 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,07688 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.70 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 213.8824 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Amaravati updates: పిల్లల భద్రత చట్టం అమలుపై డిజిపి కార్యాలయంలో రెండో రోజు వర్క్ షాపు..
అమరావతి:
-ఇవాళ జ్యూమ్ యాప్ ద్వారా పాల్గొననున్న సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు
-నేరుగా పాల్గొననున్న డిజిపి గౌతమ్ సవాంగ్, సిఐడి చీఫ్ సునీల్ కుమార్
-పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం
Amaravati updates: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రక్రియ..
అమరావతి:
-61.65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,497.88 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
-లబ్ధిదారుల చేతికే పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు..
-కొత్తగా ఈనెల 34,907 మందికి పెన్షన్లు..