Amaravati updates: జువనైల్ జస్టిస్ యాక్ట్ కొన్ని చోట్ల సరిగా అమలుకావడం లేదు..

అమరావతి..

జస్టిస్ కె.విజయలక్ష్మి

-హైకోర్టు జువనైల్ జస్టిస్ కమిటీ మెంబర్ గా కొన్ని ఇంకా మార్పు జరగాల్సి ఉందని గమనించాం

-సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపిన దాని ప్రకారం పిల్లల మానసిక పరిస్ధితి తెలుసుకోవాలి

-పోలీసులు, ప్రభుత్వంలోని పలు శాఖలు చాలా బాధ్యతతో జువనైల్ జస్టిస్ కోసం పనిచేస్తున్నారు

-కొన్ని సంస్ధలు ఇంకా జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిజిష్టర్ కాలేదు

-పిల్లలను కుటుంబ వాతావరణంలో ఉంచేలా జువనైల్ హోమ్స్ ఉండాలి

-పిల్లలకు అభద్రత, అసౌకర్యం కలగకుండా ఉండాలి

-ప్రతీ బాలబాలికలకు కూడా అన్ని విషయాలలో పాల్గొనే హక్కు ఉంటుంది

-ఏ కుటుంబం నుంచీ వచ్చారో ఆ కుటుంబంలో తిరిగి కలిసేలా జువనైల్ జస్టిస్ యాక్ట్ మాలు ఉండాలి

-అనాధ పిల్లలను దత్తత చేయడానికి కూడా అవకాశాలు కల్పించాలి

-సైకాలజిష్టు, సైకియాట్రిష్ట్ ద్వారా వారికి మానసిక స్ధైర్యం కల్పించాలి

-ప్రతీనెలా కచ్చితంగా జువనైల్ హోమ్స్ పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి

-జువనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 39 ప్రకారం రక్తబంధం ఉన్న పిల్లలు ఒకే దగ్గర ఉంచబడాలి

-నేరం చేసినట్లుగా చెపుతున్న పిల్లలు కూడా మామూలు పిల్లలుగానే భావించి చూడబడాలి

-నేరం ఆపాదించబడిన పిల్లలను నేరస్ధులుగా చూడకూడదు

Update: 2020-10-01 06:35 GMT

Linked news