Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Nellore updates: ఇసుక డంపింగ్ యార్డ్ అక్రమ రవాణా. అడ్డుకున్న గ్రామస్తులు..
నెల్లూరు :--
-- ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం ఇసుక డంపింగ్ యార్డ్ అక్రమ రవాణా. అడ్డుకున్న గ్రామస్తులు.
-- ఉన్నతాధికారులకు ఫిర్యాదు.
-- ఒక లారీ, జెసిబి ని సీజ్ చేసిన పోలీసులు.
-- వివాదం నేపథ్యంలో అప్పారావు పాలెం ఇసుక రీచ్ నిర్వహణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు.
-- రాత్రి వేళల్లో ఆగని రవాణా.
Somasila Dam updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...
నెల్లూరు :-
-- ఇన్ ఫ్లో 37,900 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 30,800 క్యూసెక్కు లు.
-- నీటి మట్టం 74.383 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు
Anantapur district updates: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు..
అనంతపురం:
-ధర్మవరం, గొట్లూరు చెరువుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీరు.
-జలాశయంలో 7 టిఎంసిల కు పైగా నీరు చేరితే ముంపు గ్రామాలైన మర్రిమాకుల పల్లి, సిసి రేవు పూర్తిగా నీట మునిగే ప్రమాదం.
-అప్రమత్తమైన అధికారులు ఒక గేటు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
Handri River updates: ఉగ్రరూపం దాల్చిన హంద్రీ నది..
కర్నూలు జిల్లా...
-కర్నూలులో మరో సారి ఉగ్రరూపం దాల్చిన హంద్రీ నది..
-రాత్రి కురిసిన వర్షానికి పొంగి పొర్లుతున్న హంద్రీ నది.
-నగరం లోని కల్లూరు వక్కెర వాగు వద్ద ప్రమాద స్థాయి లో పరుతున్న వాగు....
Ananthapur district updates: వాలంటీర్ వీరప్ప పై గుర్తుతెలియని దుండగులు దాడి..
అనంతపురం :
-మడకశిర పట్టణంలోని శివాపురం లో వాలంటీర్ వీరప్ప పై గుర్తుతెలియని దుండగులు దాడి.
-పింఛన్ పంచడానికి వెళ్లిన వాలంటీర్ పై దాడి చేసి కళ్ళల్లోకి కారం కొట్టి రూ.43.000 వేల తో పరారైన దుండగులు.
-18 మందికి పంచాల్సిన పింఛన్ డబ్బు.
-ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వాలంటరీ.
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 15,390 మంది భక్తులు
-తలనీలాలు సమర్పించిన 4,811 మంది భక్తులు
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.43 కోట్లు
-పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం గరుడసేవ
-కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.
Srisailam project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద...
కర్నూలు జిల్లా....
-4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 1,50,978 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 1,42,930 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.90 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 215.3263 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Amaravati updates: పార్లమెంట్ నియోజకవర్గాలకు మహిళా అధ్యక్షులను ప్రకటించనున్న టీడీపీ..
అమరావతి..
-నేడు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది మహిళా అధ్యక్షులను ప్రకటించనున్న టీడీపీ..
-25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మహిళా ప్రధాన కార్యదర్శులను ప్రకటించనున్న టీడీపీ..
-నేడు ప్రకటించనున్న 50 పార్టీ పదవుల్లో బీసీ మహిళలు 21, ఎస్సీ మహిళలు 8, ఎస్టీ 2, ఓసీలు 19 మంది
-తెలుగు మహిళ అధ్యక్షురాలు గా వంగలపూడి అనిత కొనసాగింపు
Vijayawada updates: రాం నాధ్ కోవింద్ కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్...
విజయవాడ-రాజ్ భవన్..
-భారత రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ జన్మ దిన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్.
-రాం నాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన గవర్నర్.
Vijayawada updates: బాపు మ్యూజియం ను నేడు సీఎం ప్రారంభించనున్నారు!
విజయవాడ..
-8కోట్లతో అదునికరించిన బాపు మ్యూజియం ను నేడు ఉదయం 11.40 కు సీఎం ప్రారంభించనున్నారు
-గత 10 సంవత్సరంల నుంచి మూతపడ్డ బాబు మ్యూజియం
-మ్యూజియం లో 6 గ్యాలరీలు
-10లక్షల సంవత్సరాలు క్రితం వస్తువులు, 1500 పైనే ఉన్నాయి