Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-01 00:42 GMT
Live Updates - Page 3
2020-09-01 06:31 GMT

Vizianagaram district updates: జిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి..

విజయనగరం...

-జిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి

-గత పదిహేను రోజులుగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన లక్ష్ము నాయుడు..

-పరిస్థితి విషమించడంతో గతరాత్రి మృతి

-లక్ష్మునాయుడు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన జిల్లా వైద్య అధికారులు.

2020-09-01 06:05 GMT

Anantapur district updates: మడకశిర నియోజకవర్గం లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు..

అనంతపురం :

-మడకశిర నియోజకవర్గం లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు..

-పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..

-రోళ్ల లో స్కూల్ బిల్డింగ్, దేవాలయాలలో కి చేరిన వరద నీరు..


2020-09-01 06:00 GMT

Amaravati updates: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 'స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు'పై సమీక్ష..

అమరావతి....

-సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 'స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు'పై సమీక్ష..

-సమావేశానికి హాజరవనున్న పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖా ఉన్నతాధికారులు..

2020-09-01 05:54 GMT

Kakinada rain updates: కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండ భారీగా వర్షo..

తూర్పు గోదావరి....

కాకినాడ....

-కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండ భారీగా వర్షo..

ఉరుముల మెరుపులతొ భయం. భయవాతావరణం..

-పట్నంలో అనేక పళ్లపు ప్రాంతాలు ముoపు..

2020-09-01 05:39 GMT

Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ..

విజయవాడ....

-ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ..

-రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి..

2020-09-01 04:51 GMT

Krishna district updates: అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..

కృష్ణా జిల్లా..

-విసన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోలవరం చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

-తెలంగాణ నుండి ఆంధ్రా కు బైక్ పై మద్యం తరలింపు

-టీ షర్టు లోపల కవర్లలో 101 బాటిల్స్ పెట్టుకొని వెళ్తుండగా పట్టుకున్న ఎక్స్సైజ్ పోలీసులు

-అనుమానం వచ్చి చాకచక్యంగా పట్టుకున్న ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ బాలాజీ

-నిందితులు దేవర కొండ శ్రీనివాస్.. దేవరకొండ రాజేష్..గా గుర్తింపు

-ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుండి కృష్ణా జిల్లా గన్నవరం కు తీసుకెళ్తు న్నట్టు గుర్తించిన పోలీసులు

-ఒక బైక్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

2020-09-01 04:46 GMT

Amaravati updates: శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్..

అమరావతి..

-శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్

-హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షరీఫ్

2020-09-01 04:42 GMT

Vizianagaram updates: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న ఫించన్ల పంపిణీ కార్యక్రమం....

విజయనగరం:

-జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న ఫించన్ల పంపిణీ కార్యక్రమం....

-తెల్లవారు ఝామున 5-30 గంటల నుండే ఫించన్ దారుల ఇళ్లకు వెళ్లి ఫించన్ మొత్తాలు అందజేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు

-జిల్లాలో ఉదయం 8 గంటలకు 36.01 శాతం మందికి ఫించన్లు పంపిణీ చేసిన వాలంటీర్లు

-మొత్తం 3.37 లక్షల ఫించను దారుల్లో 1.21 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేసి రెండవ స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా

2020-09-01 03:05 GMT

Amaravati updates: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం

అమరావతి....

-రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం

-రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులు

-రూ.1496.07 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం

-ఈనెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్

-కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు

-లబ్ధిదారుల చేతికే పెన్షన్ అందిస్తున్న 2.68 మంది వాలంటీర్లు

-బయోమెట్రిక్‌ తోనే పెన్షన్ల పంపిణీ

2020-09-01 03:01 GMT

Rajahmundry updates: గోదావరికి మళ్ళీ వరదలు....

తూర్పుగోదావరి -రాజమండ్రి....

-గోదావరికి మళ్ళీ వరదలు

-వణికిపోతున్న దేవీపట్నం ముంపు గ్రామాల ప్రజలు

-గోదావరి ఎగువ కాలేశ్వరం. లక్ష్మి బ్యారేజ్ లను దిగువకు విడుదలవుతున్న 8లక్షలకు పైగా వరద నీరు

-ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలకు భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద నీటిమట్టం

-పోలవరం కాఫర్ డ్యాం వద్ద క్రమేణా పెరుగుతున్న వరద

-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను ఎత్తి అఖండ గోదారి బేసిన్ ను ఖాళీ చేస్తున్న ఇరిగేషన్ అధికారులు

-ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం గోదారినీటిమట్టం 5.20 అడుగులు

-ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 2లక్షల 25వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

-సాయంత్రానికి ధవలేశ్వరం వద్ద పెరగనున్న వరదనీటిమట్టం

-భద్రాచలం వద్ద ప్రస్తుతం వరద నీటిమట్టం 34.90 అడుగులు మొదటివార్నింగ్ వరకూ చేరుకునే అవకాశం

Tags:    

Similar News