Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-01 00:42 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-01 14:28 GMT

అమరావతి:

- ఫీజుల నియంత్రణ పై ఏపీ హైకోర్టు లో విచారణ..

- జీవో నెంబర్ 46 ఉల్లంఘనలపై 18లోగా వివరణ ఇవ్వండి..

- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ను ఆదేశించిన హైకోర్టు..

- ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు, ఎన్ని స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు..

- ఎన్ని స్కూళ్లు పై చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరిన న్యాయస్థానం..

2020-09-01 14:27 GMT

ప్రకాశం జిల్లా,

- సింగరాయ కొండ బాలిరెడ్డి నగర్లో చోటుచేసుకున్న ధా దారుణ సంఘటన.

- మైనర్ బాలికను బెదిరిస్తూ ఆరు నెలలుగా అత్యాచారం చేసిన ఓ కామాంధుడు.

- సింగరాయకొండ పట్టణంలోని బాలిరెడ్డి నగర్‌లో చోటుచేసుకున్న ఘటన.

- పేద కుటుంబానికి చెందిన మైనర్ బాలిక (15) యుగంధర్ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తోన్న క్రమంలో. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని బెదిరించి ఆరు నెలలుగా లైంగిక దాడి.

- తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.

- వైద్య పరీక్షలు నిర్వహించి గర్భవతిగా తేల్చిన వైద్యులు.

- సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశిన బాలిక తల్లిదండ్రులు.

- కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.

- నిందితుడు యుగంధర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.

2020-09-01 11:45 GMT

అమరావతి


వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకం కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల


2021-22 నుంచి రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకం అమలు.


నెల వారి బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం


అంతే మొత్తాన్ని డిస్కం లకు చెల్లించేలా మార్గదర్శకాల విడుదల


వ్యవసాయ విద్యుత్ వినియోగం కోసం స్మార్ట్ మీటర్ల ను ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం


2020-09-01 11:44 GMT

కడప :


రెండు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి


ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ కి వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి


ఈ రోజు ఇడుపులపాయలో బస చేయనున్న సీఎం... రేపు ఇడుపులపాయలో కుటుంబ సభ్యలతో కలిసి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనున్న సిఎం జగన్ ....


2020-09-01 11:44 GMT

శ్రీకాకుళం జిల్లా..


సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి లో దారుణం.


ప్రియుడి చేతిలో మోసపోయిన యువతిని లైంగికంగా వేధిస్తున్న కుల పెద్దలు.


కోరిక తీర్చాలంటూ యువతి పై కుల పెద్దల ఒత్తిడి.


కుల పెద్దల వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.


తనకు కుల పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.


రెండు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే యువకుడ్ని ప్రేమించిన యువతి.


ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన లక్ష్మణరావు.


దీనితో మూడు నెలల క్రితం కుల పెద్దలను ఆశ్రయించిన యువతి కుటుంబ సభ్యులు.


బాధితురాలు మైనర్ కావడంతో కుల పెద్దల సమక్షంలో రాజీకు ఒప్పుకున్న లక్ష్మణరావు.


లక్ష్మణరావు నుండి 18 లక్షలు వసూలు చేసిన కుల పెద్దలు.


బాధితురాలు కుటుంబానికి 8 లక్షలు ఇచ్చి 10 లక్షలు స్వాహా చేసిన కుల పెద్దలు.


మరికొంత డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణరావు పై ఒత్తిడి.


కుల పెద్దల ఒత్తిడి కి చేతులేత్తేసిన లక్ష్మణరావు.


10 లక్షల స్వాహా విషయం చెప్పకుండా బాధితురాలితో పోలీసులకు ఫిర్యాదు చేయించిన కుల పెద్దలు.


యువతి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.


ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి లక్ష్మణరావు ను అరెస్ట్ చేసిన పోలీసులు.


45 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన లక్ష్మణరావు.


కేసు సెటిల్మెంట్ కు కుల పెద్దలకు 18 లక్షలు ఇచ్చానని లక్ష్మణరావు చెప్పడంతో అవాక్కైన యువతి.


18 లక్షలు పరిహారం చెల్లించిన ప్రియుడ్ని జైలుకు పంపించడం పై కుల పెద్దలను నిలదీసిన యువతి.


మిగిలిన డబ్బు కావాలంటే తమ కోర్కెలు తీర్చాలంటూ యువతి పై ఓ కుల పెద్ద ఒత్తిడి.


బయటకు చెప్తే చంపేస్తామని వార్నింగ్.


యువతి ఇటీవల మేజర్ కావడంతో జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు.


2020-09-01 10:31 GMT

అమరావతి


ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...


మండలి చైర్మెన్ షరీఫ్ గారు కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్దిస్తున్నాను.


2020-09-01 10:31 GMT

శ్రీకాకుళం జిల్లా..


జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..


గడిచిన 24 గంటల్లో 629 పాజిటివ్ కేసులు నమోదు..


జిల్లాలో 25,152 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..


ఈరోజు కరోనా నుంచి కోలుకుని 657 మంది డిశ్చార్..


ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6,918 ఆక్టీవ్ కేసులు..


2020-09-01 10:31 GMT

విజయవాడ


స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ, జవహర్ రెడ్డి


ఆరు నెలలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది


మరణాల సంఖ్యను తగ్గించడం ప్రధాన ఉద్దేశం


సీరియస్ కేసులను గుర్తించి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స


అనంతరం దగ్గరలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ కు పంపుతాం


మరణాలను కంట్రోల్ చేయడంలో సఫలీకృతం అయ్యాం


ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే సీరియస్ కేసు


14410, 108, 104 కాల్ సెటర్లకు వచ్చే ప్రతీకాల్ హ్యాండిల్ చేస్తున్నాం


ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటే పరీక్షల ఫలితాలు పక్కనపెట్టి కూడా ఆసుపత్రిలో చేరాలి


రెండు విడతలుగా మరణాల సంఖ్య, పాజిటివ్ కేసులు


3 ఆగష్టు నుంచీ 14 ఆగష్టు వరకూ చేసిన సర్వేలో ఐదు జిల్లాలలో కేసుల శాతం తగ్గింది


నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలలో కేసుల సంఖ్య పెరిగింది


ప్రకాశంలో అత్యధికంగా 76% పెరిగాయి కేసులు


మరణాల సంఖ్య ఆగష్టు మొదటి పక్షం రోజులతో పోల్చుకుంటే రెండో పక్షం రోజులలో తగ్గాయి


నెల్లూరులో మరణాల‌ సంఖ్య పెరిగింది


సీరో సర్వైలెన్స్ నాలుగు జిల్లాలలో చేసాం


16.7% అనంతపురంలో, 14.4% తూర్పుగోదావరి, 24% కృష్ణా, 8.3% నెల్లూరులో కోవిడ్ వచ్చి పోయింది


అర్బన్ ప్రాంతాలలోనే కోవిడ్ ఎక్కువ మందికి వచ్చి పోయినట్టు తెలుస్తోంది


44% అర్బన్, 56% రూరల్ లో వచ్చాయని ఇటీవల‌ సర్వేలో తెలిసింది


కేసులు రెండు రెట్లు కావడానికి 40 రోజులు పట్టింది


1.41 మంది వ్యక్తులకు అత్యధికంగా కృష్ణా జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతోంది


97% కేసులకు కాంటాక్ట్ ఎవరో చెప్పగలుగుతున్నాం


మాస్క్ పూర్తిగా ధరించేలా మాస్కే కవచం అని ప్రారంభించాం


భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు తరచుగా కడుక్కోవడం కోవిడ్ క్రమశిక్షణ


హెల్ప్ డెస్క్, డిస్ప్లే బోర్డులు 217 హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసాం


శాంపిల్ టెస్టింగ్, రిపోర్టులు 24 గంటలు ఇచ్చేలా ఏర్పాటు చేసాం


ప్రతీ సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం


అడ్మిషన్లకు ఎటువంటి సిఫారసులు అవసరం లేదు


నెల్లూరు టౌన్ ప్రజలు జీజీహెచ్ కు వెళుతున్నారు



2020-09-01 10:30 GMT

కడప ...


జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కరోనా పాజిటివ్..


నేడు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన..


ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు కరోనా నిర్దారణ పరీక్షలు..


ఈ పరీక్షల లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ


దీంతో హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిన సుధీర్ రెడ్డి


15 రోజు లు ఎవరు ఎమ్మెల్యే ని కలవకుండా ఉండాలని కార్యకర్తలకు పిలుపు


2020-09-01 10:30 GMT

అమరావతి


ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...


శ్రీ ఎంఏ షరీఫ్ గారు కరోనా బారిన పడటం బాధాకరం.


ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం.


ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.


Tags:    

Similar News