Diabetes Reasons: మధుమేహ బాధితులుగా మారుతున్న యువత.. కారణాలు ఇవే..!
Diabetes Reasons: ఆధునిక కాలంలో జీవనశైలి మారడంతో చాలామంది డయాబెటీస్‌కు గురవుతున్నారు. నేడు ప్రతి ఇంట్లో ఒకరైనా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు.
Diabetes Reasons: ఆధునిక కాలంలో జీవనశైలి మారడంతో చాలామంది డయాబెటీస్‌కు గురవుతున్నారు. నేడు ప్రతి ఇంట్లో ఒకరైనా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఇందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. డయాబెటిస్ అనేది తీవ్రమైన సమస్య. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల కారణంగా సంభవిస్తుంది. దీనిని నియంత్రించకపోతే క్రమంగా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహం రావడానికి గల కారణాలను, నివారించే మార్గాలను తెలుసుకుందాం.
మధుమేహం అంటే ఏమిటీ..?
శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఈ సమస్యను డయాబెటిస్ అంటారు. వాస్తవానికి శరీరంలోని రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే పని ఇన్సులిన్ ద్వారా జరుగుతుంది. ఇది ప్యాంక్రి యాస్‌లో ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. కొన్ని కారణాల వల్ల క్లోమం తగినంత పరిమాణంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి మధుమేహం సమస్య ప్రారంభమవుతుంది.
మధుమేహం రకాలు
మధుమేహం ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. టైప్-1, టైప్-2. ప్యాంక్రియాస్‌లో ఏదైనా లోపం కారణంగా చిన్నతనం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు పిల్లవాడు టైప్-1 డయాబెటిస్‌కు గురవుతాడు. అతని శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల అతడి జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. టైప్-2 మధుమేహం అనారోగ్య జీవనశైలి కారణంగా వయస్సు పెరిగేకొద్దీ వస్తుంది. కానీ ఈ రోజుల్లో యువత అనారోగ్య జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే టైప్-2 డయాబెటిస్‌కు గురవుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్‌కు కారణాలు
1. అనారోగ్య జీవనశైలి
2. ఒత్తిడి
3. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం
4.క్రమరహిత జీవనశైలి
5.తక్కువ శారీరక శ్రమ
6. ఊబకాయం
మధుమేహం నివారణలు
1. జీవనశైలి మెరుగుదల
2. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం
3. ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, సీజనల్ పండ్లను తీసుకోవడం
4. తగినంత నీరు తాగడం
5. ఒత్తిడిని తగ్గించండి
6. శారీరకంగా చురుకుగా ఉండటం
7. రోజూ అరగంట పాటు వ్యాయామం, వాకింగ్ చేయడం