Liver Cancer Alert: యువతకి అలర్ట్.. ఇలాంటి లక్షణాలు లివర్ క్యాన్సర్‌కి సంకేతాలు..!
Liver Cancer Alert: చెడు వ్యసనాల కారణంగా నేటికాలంలో యువత ఎక్కువగా లివర్ క్యాన్సర్ బారినపడుతున్నారు.
Liver Cancer Alert: చెడు వ్యసనాల కారణంగా నేటికాలంలో యువత ఎక్కువగా లివర్ క్యాన్సర్ బారినపడుతున్నారు. దీని లక్షణాలను వీరు సరైన సమయలో గుర్తించడం లేదు. ఫలితంగా వ్యాధి ముదిరాక హాస్పిటల్‌కు వెళ్లున్నారు. అప్పుడు ట్రీట్మెంట్ చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. దీంతో చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రతను, మరణాల రేటును తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు లివర్ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకుందాం.
లివర్ క్యాన్సర్ లక్షణాలను ఎవరూ అంత తొందరగా గుర్తించలేరు. లివర్‌లో అనేక రకాల క్యాన్సర్లు వస్తాయి. వీటిలో అత్యంత సాధారణమైనది హెపాటోసెల్లర్ కార్సినోమా. ఇది ప్రధానం గా కాలేయ కణాలలో ప్రారంభమవుతుంది. లివర్ క్యాన్సర్ బారిన పడిన చాలా మందికి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే క్యాన్సర్ కాలక్రమేణా ముదిరిన కొద్దీ లక్షణాలు తీవ్రమవుతాయి. ప్రారంభ లక్షణాల్లో కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కుడివైపున నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ రకమైన నొప్పి గ్యాస్ వల్ల కూడా వస్తుంది. కానీ కడుపు వాపు, తరచుగా వాంతులు, వికారం సమస్యలు కడుపు నొప్పితో పాటు కొనసాగితే క్యాన్సర్ లక్షణంగా గుర్తించండి.
క్యాన్సర్ ముదిరిన కొద్దీ శ్రమ లేకుండా బరువు తగ్గుతారు. ఆకలి లేకపోవడం, తరచుగా బలహీనత, వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. బలహీనత, అలసట, కడుపులో నిరంతర వాపు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. రక్తంలో రసాయన స్థాయిలను సమతుల్యం చేయడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి బైల్ అనే ఉత్పత్తిని స్రవించడానికి, శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి లివర్ సరిగ్గా పనిచేయాలి. లేదంటే అన్ని సమస్యలు మొదలవుతాయి.