Health Tips: శరీరంలో కొలస్ట్రాల్‌ పెరిగిందంటే ఈ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లే..!

Health Tips: శరీరంలో కొలస్ట్రాల్‌ పెరిగిందంటే ఈ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లే..!

Update: 2022-11-29 04:30 GMT

Health Tips: శరీరంలో కొలస్ట్రాల్‌ పెరిగిందంటే ఈ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లే..!

Health Tips: ఈ రోజుల్లో ప్రజలలో కొలెస్ట్రాల్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. అయితే చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. తర్వాత ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. కొలస్ట్రాల్‌ రక్తంలో ఉండే ఒక మైనపు లాంటి పదార్థం. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండోది చెడు కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే అనేక సమస్యలను ఎదుర్కొంటారు. శరీరంలో దీని పరిమాణం పెరిగినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

గుండె జబ్బుల ప్రమాదం

కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం గుండెకు అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండెపోటు ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ ధమనుల గోడలలో స్టోరేజ్ అవుతుంది. దీని కారణంగా ఛాతి నొప్పి ఏర్పడి అనంతరం గుండెపోటు వస్తుంది.

స్ట్రోక్ ప్రమాదం

అధిక కొలెస్ట్రాల్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెను మాత్రమే కాకుండా మెదడుకు వెళ్లే ధమనులను అడ్డుకుంటుంది. దీని కారణంగా మెదడుకు రక్త ప్రవాహం అందదు. అంతే స్ట్రోక్ ఏర్పడుతుంది.

కిడ్నీ ఫెయిల్‌

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఒక్కోసారి కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీకి సంబంధించిన నాళాలలో రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీంతో కిడ్నీలు పనిచేయకుండా పోతాయి.

Tags:    

Similar News