Gamophobia: గామోఫోబియా అంటే ఏమిటీ.. వీరు పెళ్లి అంటే ఎందుకు భయపడుతారు..!

Gamophobia: కొంతమంది వ్యక్తులు వారి అలవాట్లు, వారు పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు, వారు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల విచిత్రమైన వైఖరిని కలిగి ఉంటారు.

Update: 2024-01-14 14:30 GMT

Gamophobia: గామోఫోబియా అంటే ఏమిటీ.. వీరు పెళ్లి అంటే ఎందుకు భయపడుతారు..!

Gamophobia: కొంతమంది వ్యక్తులు వారి అలవాట్లు, వారు పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు, వారు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల విచిత్రమైన వైఖరిని కలిగి ఉంటారు. అందరిలో కలవడానికి అస్సలు ఇష్టపడరు. నిత్యం ఏదో ఒక భయంతో బతుకుతుంటారు. జనాల మధ్యలోనే ఉంటారు కానీ జనాల్లో కలవరు. వారి లోకంలో వారే ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండే వ్యక్తులు కొన్ని రకాల ఫోబియాకి గురై ఉంటారు.

ఫోబియాలో రకరకాలు ఉంటాయి.

కొందరు ఎత్తైన బిల్డింగ్‌లను చూసి భయపడుతారు. కొందరు నీటిని చూసి భయపడుతారు. మరికొందరు లిఫ్ అస్సలు ఎక్కరు. ఇంకొందరికి చీకటి అంటే భయం. ఇలా రకరకాలు ఉంటాయి. తాజాగా యువతలో కొత్త భయం పెరుగుతోంది. ఈ భయం పేరు గామోఫోబియా. దీనివల్ల ఏం జరుగుతుంది. ఇది యువతలో మాత్రమే ఎందుకు పెరుగుతుంది తదితర విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

గామోఫోబియా అంటే ఏమిటి..?

గామోఫోబియా అనేది రిలేషన్‌ షిప్‌కు సంబంధించిన భయం. ఒక వ్యక్తి మరొకరితో ఏదైనా కమిట్‌మెంట్‌కు భయపడితే దానిని గామోఫోబియా అంటారు. ఇది పెళ్లి విషయంలో ఎక్కువగా జరుగుతుంది. అంటే పెళ్లి చేసుకోకపోవడాన్ని గామోఫోబియా అంటారు. ఏ సంబంధం ఎక్కడికి దారితీస్తుందో అనే అనుమానంతో ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ ఫోబియాలో వ్యక్తి ఒంటరిగా ఉంటూ తరచూ ఆలోచిస్తూ ఉంటారు.

నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఈరోజుల్లో యువతలో గామోఫోబియా బాగా పెరిగిపోయింది. చాలా మంది యువత పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. రిలేషన్ షిప్ లో కమిట్ అవ్వరు. చాలా మంది యువత కుటుంబానికి బదులుగా పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు ఆర్థిక సమస్యల కారణంగా వివాహానికి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొనాలి.

Tags:    

Similar News