Dark Circle: డార్క్ సర్కిల్ సమస్యకి కారణాలేంటి.. మందులు ఎందుకు పనిచేయవు..?
Dark Circle: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి.
Dark Circle: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. అయితే నల్లటి వలయాలు అందాన్ని చెడగొట్టడం తప్ప ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. కానీ వీటిని తేలికగా తీసుకోకూడదు. డార్క్ సర్కిల్‌లను ఇంటి చిట్కాల ద్వారా నయం చేయవచ్చు. జీవనశైలిలో చిన్న మార్పులు చేసినా తగ్గిపోతాయి. అయితే కొన్ని సార్లు ఈ చిట్కాలేమి వీటిపై ఎటువంటి ప్రభావం చూపించవు. ఇది ఏ సందర్భాలలో జరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.
డార్క్ సర్కిల్ కారణాలు
1. చాలా ఒత్తిడికి గురికావడం
2. నిద్ర లేకపోవడం
3. పోషకాహార లోపం
4. ధూమపానం, మద్యం వ్యసనం
5.పెరుగుతున్న వయస్సు కారణంగా
6. జన్యుపరమైన కారణాల వల్ల
7. శరీరంలో రక్తం లేకపోవడం
8. సుదీర్ఘ అనారోగ్యం కారణంగా
9. హార్మోన్ల మార్పుల కారణంగా
10. అలెర్జీ కారణంగా
11. మేకప్ తొలగించకుండా నిద్రించడం
డార్క్ సర్కిల్‌ను ఎలా తొలగించాలి?
కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి గల కారణాల గురించి తెలిస్తే వీటిని నయం చేసే మార్గం లభ్యమవుతుంది. పెరుగు, తేనె, అలోవెరా జెల్, విటమిన్-ఇ వంటి వాటిని డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయండి. ఇంటి నివారణలు పని చేయకపోతే ఎక్కువ సమయం వృధా చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే వాటిని నయం చేయడానికి కొన్నిసార్లు మందులు, సిరప్‌లు అవసరం. జన్యుపరమైన కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటే వాటిని వదిలించుకోలేరు కానీ రెగ్యులర్ కేర్, మేకప్‌తో మీరు వాటిని కనిపించకుండా నిరోధించవచ్చు.