Face Wash Tips: సబ్బు,ఫేస్‌వాష్ వద్దు.. వీటితో శుభ్రం చేస్తే సహజ మెరుపు..!
Face Wash Tips: ముఖం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండాలంటే పేరుకుపోయిన ఆయిల్, దుమ్ముధూళిని వదిలించుకోవడం అవసరం.
Face Wash Tips: ముఖం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండాలంటే పేరుకుపోయిన ఆయిల్, దుమ్ముధూళిని వదిలించుకోవడం అవసరం. అయితే సబ్బు, ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవడం చర్మానికి హానికరం. హోమ్ రెమిడీస్ చాలా బెస్ట్. ముఖాన్ని కడగడానికి సహజమైన పదార్థాలను ఉపయోగిస్తే సహజసిద్దమైన మెరుపు వస్తుంది. అలాంటి పదార్థాలు మన వంటగదిలోనే లభిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఓట్ మీల్
ఓట్‌మీల్ ఒక సహజమైన స్క్రబ్. ఇది ముఖం పై నుంచి మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్ మీల్ అనేది క్లియోపాత్రా చర్మాన్ని అందంగా ఉంచిన క్లాసిక్ క్లెన్సర్.
తేనె
తేనె ఒక సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.
పచ్చిపాలు
పాలలో ఉండే ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు చర్మాన్ని తేమగా మారుస్తాయి. అరచేతిలో కొద్దిగా పచ్చిపాలు తీసుకొని చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
దోసకాయ రసం
దోసకాయ రసం లేదా గుజ్జును ముఖానికి బాగా పట్టించాలి. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దోసకాయ శీతలీకరణ ప్రభావం సున్నితమైన పొడి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
అలోవెరా జెల్
అలోవెరా జెల్ ఒక సహజ మాయిశ్చరైజర్. యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అందుకే దీనిని బ్యూటీ ప్రొడాక్ట్స్‌లో వాడుతారు.