Walking Tips: వాకింగ్‌ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయవద్దు.. గుర్తుంచుకోండి..!

Walking Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి నడక చాలా ముఖ్యం.

Update: 2022-05-10 11:30 GMT

Walking Tips: వాకింగ్‌ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయవద్దు.. గుర్తుంచుకోండి..!

Walking Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి నడక చాలా ముఖ్యం. అయితే నడక తర్వాత కొంతమంది చాలా పొరపాట్లు చేస్తారు. దీని వల్ల శరీరానికి లాభం బదులు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వ్యాయామం తర్వాత శరీరం కొన్ని పనులని భరించదు. ఉదాహరణకు మీరు నడక తర్వాత నిద్రపోతే ఇంకా సమస్యలు పెరుగుతాయి. లేదా మీరు స్నానం చేస్తే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి నడక తర్వాత చేసే తప్పులు ఏంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. వెంటనే ఆహారం తినవద్దు

నడక తర్వాత ఆకలిగా ఉంటుంది. అయితే కొంతమంది వెంటనే ఆహారం తింటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. దీనివల్ల వారు లాభానికి బదులుగా నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి 20-30 నిమిషాల తర్వాత మాత్రమే మాత్రమే ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

2. నిద్ర చాలా హానికరం

కొంతమంది నడక తర్వాత చాలా అలసిపోతారు. వారు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు వాకింగ్‌ చేసిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకొని నిద్రపోతే మంచిది. ఎందుకంటే నడక తర్వాత గుండె కొట్టుకోవడం వేగంగా ఉంటుంది. కాబట్టి నిద్రకు దూరంగా ఉండాలి.

3. దుస్తులను మార్చాలి

నడక తర్వాత చాలా మందికి చెమట పడుతుంది. ఈ పరిస్థితుల్లో దుస్తులు మొత్తం తడిసిపోతాయి. అప్పడు వాటిని వెంటనే తీసేయాలి. లేదంటే శరీరంపై అలెర్జీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నడక తర్వాత దస్తులని మార్చడం మంచిది.

4. వెంటనే స్నానం చేయడం

వాకింగ్‌ తర్వాత శరీరం చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు వారు వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జలుబు లేదా సైనస్ సమస్యకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకొని స్నానం చేయాలి. తద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.

Tags:    

Similar News