Health Tips: 70 ఏళ్లు దాటితే వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. ఇదొక్కటి చేశారంటే నిత్య యవ్వనం..!
Health Tips: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోవడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు.
Health Tips: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోవడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు చేస్తూ అనవసరమైన రోగాలని తెచ్చుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు వ్యాయామం చేయడం అవసరం. ముఖ్యంగా నడక చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం 70 ఏళ్ల వయసు దాటినవారు ప్రతిరోజు నడవడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదాలకు దూరంగా ఉంటారని తేలింది. నడక ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
శాస్త్రవేత్తల ప్రకారం ప్రతిరోజూ 2000 అడుగుల కంటే తక్కువ నడిచే వారితో పోలిస్తే ప్రతిరోజూ 4500 అడుగులు నడిచేవారిలో వ్యాధుల ప్రమాదం తక్కువగా కనిపించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం అదనంగా 500 అడుగులు నడవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులలో 14 శాతం తగ్గింపును చూశారు. ప్రతిరోజూ 500 అడుగులు ఎక్కువ నడవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
బరువు తగ్గుతారు
కేలరీలను బర్న్ చేయడానికి నడక మంచి మార్గం. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించాలి.
గుండె ఆరోగ్యం
నడక హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదం తక్కువ
నడక కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు అర్ధగంట నడిస్తే రోజు మొత్తం చురుకుగా ఉంటారు.
డయాబెటిస్ కంట్రోల్
నడక టైప్ 2 డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన
నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, డిప్రెషన్ లక్షణాలను దూరం చేయడానికి సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్, ఇతర డిమెన్షియాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.