Vitamin A Deficiency: విటమిన్ ఎ లోపించిందా.. సంతానోత్పత్తిపై ఎఫెక్ట్ పడుతుంది జాగ్రత్త..!
Vitamin A Deficiency: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలతో పాటు విటమిన్లు కూడా అవసరం.
Vitamin A Deficiency: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలతో పాటు విటమిన్లు కూడా అవసరం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా విటమిన్ ఏ కంటి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కొత్తగా దీనిలోపం సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది. విటమిన్ ఎ పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోపం గర్భం ధరించడంలో సమస్యలు, వంధ్యత్వానికి కారణమవుతుంది.
విటమిన్ ఎ లోపం ఎలా వస్తుంది?
విటమిన్ ఎ శరీరంలో తయారుకాదు. దీనిని ఆహారాల నుంచి మాత్రమే పొందవచ్చు. శరీరం ఆహారాన్ని సరిగ్గా గ్రహించలేనప్పుడు విటమిన్ ఎ లోపం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మీరు విటమిన్ ఎ లోపం లక్షణాలను గుర్తించాలి.ఈ 5 పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు విటమిన్ ఎ లోపం నుంచి బయటపడుతారు.
విటమిన్ ఎ లోపం లక్షణాలు
1. తక్కువ వెలుతురులో చూడలేకపోవడం
2. కళ్లు పొడిబారడం
3. కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం
4. చర్మం పొడిబారడం, దురద పెట్టడం,
5. కెరాటినైజేషన్
6. పిల్లల్లో నెమ్మదిగా ఎదుగుదల
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు
చిలగడదుంప
చిలగడదుంపలో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ లభిస్తుంది. మీరు చిలగడదుంపను ఉడికించి తింటే దాని నుంచి 1403 ఎంసీజీ విటమిన్ ఎ లభిస్తుంది.
క్యారెట్
క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అరకప్పు పచ్చి క్యారెట్‌లో 459 ఎంసీజీ విటమిన్ ఎ ఉంటుంది. ఇది కాకుండా క్యారెట్‌లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది మెరుగైన పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
బచ్చలికూర
బచ్చలికూర అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరకప్పు ఉడికించిన బచ్చలికూరలో 573 ఎంసీజీ విటమిన్ ఎ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బ్రోకలి
విటమిన్ ఎ పుష్కలంగా ఉండే మరో కూరగాయ బ్రోకలి. కేవలం ఒక అరకప్పు సర్వింగ్‌లో 60 ఎంసీజీ విటమిన్ ఎ ఉంటుంది. దీనితో పాటు ఇందులో విటమిన్ సి, కె పెద్ద మొత్తంలో లభిస్తుంది.
పచ్చి మామిడి
పచ్చి మామిడిలో 112 ఎంసీజీ విటమిన్ ఏ ఉంటుంది. ఇది కాకుండా మామిడిలో యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి పేగు మెరుగైన పనితీరుకు దోహదం చేస్తాయి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతాయి.