Health News: ముఖంలోని ఈ భాగంలో నొప్పి ఉంటే చాలా ప్రమాదం..!

Health News: ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా అన్ని వయసుల వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Update: 2022-03-26 11:00 GMT

Health News: ముఖంలోని ఈ భాగంలో నొప్పి ఉంటే చాలా ప్రమాదం..!

Health News: ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా అన్ని వయసుల వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దవడ నొప్పి 'తేలికపాటి గుండెపోటు'కి సంకేతమని గుర్తుంచుకోండి. అలాగే ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, చెమట పట్టడం వంటి సమస్యలు కూడా గుండెపోటు లక్షణాలు అయ్యే అవకాశం ఉంది. మీరు ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

1. దవడ నొప్పి

దవడ వెనుక భాగంలో నొప్పి తేలికపాటి గుండెపోటుకు సంకేతం. ఇందులో దవడ నుంచి నొప్పి మొదలై మెడ వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి చాలా అకస్మాత్తుగా వస్తుంది. ఇప్పటివరకు మీరు ఇలాంటి నొప్పిని ఎప్పుడు అనుభవించి ఉండరు.

2. చేతిలో జలదరింపు

చేతిలో నొప్పి లేదా జలదరింపు అనేది తేలికపాటి గుండెపోటుకు సంకేతం. ఈ నొప్పి ఛాతీ, మెడ వరకు పెరుగుతుంది. రాత్రిపూట అకస్మాత్తుగా చెమటలు పడితే అది గుండెపోటుకు దారి తీస్తుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

3. ఊపిరి ఆడకపోవడం

మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మీ గుండె సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఇది కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతాలు అయ్యే అవకాశం ఉంది.

4. కొన్ని పొట్ట సమస్యలు కూడా గుండెపోటుకు కారణమవుతాయి. త్రేనుపులు, పొత్తికడుపు నొప్పి ఇవన్నీ తేలికపాటి గుండెపోటు లక్షణాలుగా చెప్పవచ్చు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News