Guru Purnima 2024: నేడు గురుపూర్ణమి..మీకు గురువులకు ఇలా శుభాకాంక్షలు తెలుపండి
Guru Purnima 2024:నేడు గురుపూర్ణమి..ఈ సందర్భంగా మీకు మార్గనిర్ధేశకం చేసిన వ్యక్తులకు, గురువులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
Guru Purnima 2024:సనాతన ధర్మంలో గురువును దేవుడితో సమానంగా భావిస్తూ ..పూజిస్తుంటారు. ప్రతిఏడాది ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజు గురుపౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. ఈఏడాది నేడు అంటే జులై 21న జరుపుకుంటున్నారు. ఈ రోజు గురువులను పూజించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వేదాలను రచించిన వేద వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించాడని ప్రతీతి. అందుకే ఈరోజు వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మీరు కొన్ని ప్రత్యేక మెసేజ్ ల ద్వారా మీ గురువుకు గురు పౌర్ణమి శుభాకాంక్షలను పంపడం ద్వారా గురువుల ఆశీర్వాదం కూడా పొందవచ్చు. గురు పౌర్ణమి స్పెషల్ విషెస్ మీకోసం.
ఈరోజు మీకు చదువు నేర్పించిన గురువులకు, మీకు మార్గనిర్దేశకం చేసిన వ్యక్తులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపండి. మీ జీవితంలో వాళ్లకు్న ప్రాముఖ్యతను ఈ సందేశాల రూపంలో తెలియజేయండి.
-సాధారణ ఉపాధ్యాయుడు విషయాన్ని చెబుతాడు. సద్గురువు విపులంగా వివరిస్తుంటాడు. గొప్ప గురువు స్పూర్తినిస్తాడు.
-అజ్నానపు పొరలను తొలగించి..జ్నానం అనే విత్తును నాటి వికాసం అనే మహా వ్రుక్షాన్ని తయారు చేసే గురువులకు, గురుతుల్యులకు పాదాభివందనాలతో గురు పూర్ణిమ శుభాకాంక్షలు
-గురువు లేని జ్నానం లేదు..జ్నానం లేని ఆత్మ లేదు..ధ్యానం, జ్నానం, సమానం, కర్మ అన్నీ గురువే ప్రసాదించినవి..గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు
-జ్నాన భాండాగారాన్ని మనకు ప్రసాదించి, భవిష్యత్తు కోసం సిద్ధం చేసిన గురువులందరికీ మేము కృతజ్ఞులము.గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు
- నాతరపున, నాకుటుంబం తరపున మీకు గురు గురుపూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు గొప్పగా గడవాలని కోరుకుంటున్నాము.
-తల్లిదండ్రులు జన్మనిస్తే..ఆ జన్మకు జీవించే కళ నేర్పేది గురువే. తెలివిని, సంస్కారాన్ని నేర్పుతూ బోధించే గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు