Health Tips: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ పండ్లు బెస్ట్‌.. అవేంటంటే..?

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం.

Update: 2022-11-19 02:27 GMT

Health Tips: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ పండ్లు బెస్ట్‌.. అవేంటంటే..?

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్యకరమైన ఊపిరితిత్తుల కారణంగా శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

దానిమ్మ

దానిమ్మ శరీరంలో రక్తహీనతను అనుమతించదు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల వడపోత జరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి దానిమ్మపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి.

యాపిల్

యాపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. శరీరంలోని ఇతర వ్యాధులను కూడా నయం చేస్తాయి. మారుతున్న సీజన్‌లో యాపిల్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కచ్చితంగా ప్రతి ఒక్కరు రోజు ఒక యాపిల్‌ తినాలి.

నారింజ

నారింజలో విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులని నయం చేస్తాయి. వాపు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షించడానికి పనిచేస్తుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్లూ బెర్రీలను క్రమం తప్పకుండా తినాలి.

Tags:    

Similar News