ఆహారం అలా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు!

Update: 2019-08-21 09:22 GMT

అసలే ఉరుకులు, పరుగుల జీవితం.. తినడానికే తీరిక ఉండని వేళలు.. టైం లేదని చెప్పి ఏదో గబాగబా తినేవాళ్లు చాలమంది ఉన్నారు. కొందరైతే పనిలో పడి తిండి విషయమే మరిచిపోతుంటారు. మార్నింగ్ చేసే టిఫెన్ మధ్యహ్నం చేస్తుంటారు. ఇంకొంతమంది సమయానికి లంచ్ చేయడానికి తీరిక ఉండదు. ఇక నైట్ ఏ టైంకి తింటారో కూడా తెలియని వాళ్లు ఉన్నారు. అయితే వేళకు తినకుండ ఉంటే.. సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆహారం గబాగబా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయట. తినే ఆహారం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని ఇష్టంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని.. మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.

ఇటీవల బరువు తగ్గేందుకు డైట్‌ పాటిస్తున్న కొంతమంది ఔత్సాహికులపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులో కి వచ్చాయి. 6 నెలల్లో మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌కు సంబంధంచి మూడు, నాలుగు సెషన్స్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. ఒకటి, రెండు సెషన్లకు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

చాలమంది పార్టీలు, పంక్షన్‌లో కొంచెం ఎక్కువగా తింటుంటారు. తరువాత లబోదిబోమంటూ కసరత్తులు చేస్తూ.. నానా కష్టాలు పడేవాళ్లు ఉన్నారు. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. అదేవిధంగా మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందంటున్నారు పరిశోధకులు.

Tags:    

Similar News