Skin Care: అందమైన ముఖానికి మూడు ప్యాక్‌లు.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..!
Skin Care: అందమైన ముఖం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. కానీ మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా ముఖంపై రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి.
Skin Care: అందమైన ముఖం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. కానీ మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా ముఖంపై రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
గంధంతో చర్మశుద్ధి
వేసవిలో చర్మం పొడిబారకుండా కాపాడుకోవడానికి గంధాన్ని ఉపయోగించవచ్చు. ఇది టాన్ నుంచి విముక్తి కలిగిస్తుంది. చర్మాన్ని చల్లబరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. గంధపు పొడిలో చల్లటి నీటిని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది టానింగ్ సమస్యని దూరం చేస్తుంది.
తేనె పసుపు
ఇది కాకుండా మీరు చర్మానికి తేనె, పసుపును కూడా ఉపయోగించవచ్చు. ఎండాకాలంలో చర్మానికి తేనె, పసుపు రాసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా ఎరుపు లేదా దద్దుర్లు సమస్య నుంచి బయటపడవచ్చు.
అరటిపండు ప్యాక్
అరటి జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అరటిపండులో విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ ఎ, పొటాషియం లభిస్తాయి. ఇవి చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తాయి. చర్మ కణాలను కూడా రిపేర్ చేస్తాయి.
ఈ చిట్కాలను పాటించండి
దీంతో పాటు వేసవిలో శరీరంలో నీటి కొరత ఉండకూడదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ముఖంపై కనిపిస్తుంది. దీని కారణంగా ముఖం నుంచి గ్లో మిస్ అవుతుంది. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయలని తింటే శరీరంలో నీటి పరిమాణం సమృద్ధిగా ఉంటుంది.