Hair Care Tips: జుట్టు పొడవుగా, ఒత్తుగా మారాలంటే ఈ ఆయిల్‌ వాడండి.. ఎలా తయారుచేయాలంటే..?

Hair Care Tips: ప్రతి మహిళ పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటుంది.

Update: 2023-06-21 16:00 GMT

Hair Care Tips: జుట్టు పొడవుగా, ఒత్తుగా మారాలంటే ఈ ఆయిల్‌ వాడండి.. ఎలా తయారుచేయాలంటే..?

Hair Care Tips: ప్రతి మహిళ పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటుంది. దీనివల్ల వారు అందంగా కనిపిస్తారు. కానీ పొడవైన జుట్టుని మెయింటెన్‌ చేయడం అందరికి సాధ్యపడదు. కొంతమందికి ఉన్న జుట్టు కొద్ది కొద్దిగా ఊడిపోతుంటుంది. దీనివల్ల వారు మానసికంగా కుంగిపోతుంటారు. బయటికి రాలేక తమలో తాము బాధపడుతారు. ఇంకొంత మంది ఎంత ప్రయత్నించినప్పటికీ జుట్టు పెరగదు. దీంతో వారు నలుగురికిలోకి రాలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఒక నెలలో సహజ సిద్దంగా జుట్టుని పెంచుకునే ఒక ఆయిల్‌ ఉంది. దీనివల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. దీనిని ఎలా తయారుచేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

కరివేపాకు నూనె

ఈ నూనెను తయారు చేయడానికి నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, కొన్ని కరివేపాకులు, 20 గ్రాముల మెంతులు అవసరం. దీని తయారీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు చేయాల్సిందల్లా ఈ మూడింటిని కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. మెంతి గింజలు, కరివేపాకు పేస్టులా మారే వరకు ఉడికించాలి.

ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మెంతులు, కరివేపాకులను బాగా కలపాలి. చల్లారాక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు రోజులు జుట్టుకి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఇలా తయారుచేసిన నూనె వాడటం వల్ల జుట్టు పొడవుగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం విరగడం ఆగిపోతుంది. ఈ నూనె జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం ప్రారంభించండి. మీ జుట్టు నల్లగా, మందంగా పొడవుగా ఎలా మారుతుందో కొద్దిరోజుల్లోనే తెలుసుకుంటారు.

Tags:    

Similar News