Yellow Foods: ఈ పసుపు పచ్చ ఆహారాలు బరువు తగ్గిస్తాయి.. బెల్లీఫ్యాట్ సులభంగా కరుగుతుంది..!
Yellow Foods: శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది విపరీతమైన బరువు పెరుగుతున్నారు.
Yellow Foods: శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది విపరీతమైన బరువు పెరుగుతున్నారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల పెరిగిన బరువుని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు తగ్గడానికి ప్రొటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డైట్‌లో కొన్ని పసుపు ఆహారాలను చేర్చుకుంటే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. నిమ్మకాయ
నిమ్మకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇది విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్ వనరుల గొప్ప మూలం. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటికి పంపుతాయి. దీనివల్ల జీవక్రియ మెరుగవుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు.
2. అల్లం
అల్లం వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది అనేక వంటకాల రుచిని పెంచుతుంది. దీని సహాయంతో అధిక బరువుని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో అల్లం ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు మంటపై మరిగించాలి. తర్వాత వడకట్టి తాగాలి. ఉదయం పూట తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది.
3. క్యాప్సికమ్
కొంతమంది క్యాప్సికమ్‌ని పచ్చిగా తింటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే పసుపు క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పొట్ట, నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. కొంతమంది దీనిని కూరగాయలా వండుకుని తింటారు. సలాడ్‌గా కూడా తీసుకుంటారు.
4. అరటి
అరటి ఒక సాధారణ పండు. దీనిని ప్రతి వ్యక్తి ఇష్టపడుతాడు. అరటిపండు తినడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే ఇది పరిమిత పరిమాణంలో తినాలని గుర్తుంచుకోండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోరు. దీంతో బరువు తగ్గుతారు.