Health Tips: ఈ పండ్లని కలిపి తినకూడదు.. కిడ్నీనుంచి గ్యాస్ వరకు అన్నీ సమస్యలే..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆహారం, పండ్లని తీసుకోవాలి.
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆహారం, పండ్లని తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో పండ్లు బాగా ఉపయోగపడుతాయి. వీటిని నేరుగా తినడంతో పాటు జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు. కానీ కొన్ని తప్పుడు అలవాట్ల వల్ల శరీరానికి మంచి కాకుండా చెడు జరుగుతుంది. అవేంటంటే వివిధ రకాల పండ్లని ఎప్పుడు కలిపి తినకూడదు. దీనివల్ల శరీరానికి హాని జరుగుతుంది. మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జామ అరటి పండు
జామ అరటిపండును కలిపి ఫ్రూట్ సలాడ్‌గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎంత రుచిగా ఉన్నా కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గ్యాస్, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే పండ్లను గంటల గ్యాప్‌తో తినాలని గుర్తుంచుకోండి.
పాలతో కలపవద్దు
పండ్లను అనేక ఇతర పదార్థాలతో కలిపి తినకూడదు. వాటిలో ఒకటి పాలు. ముఖ్యంగా నారింజ, పైనాపిల్‌లను పాలతో కలపడం చాలా చెడ్డది. ఇది ఇన్ఫెక్షన్, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఆరెంజ్ క్యారెట్
క్యారెట్ ఆరెంజ్ కలయిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కొంతమంది క్యారెట్ జ్యూస్‌లో ఆరెంజ్ జ్యూస్ కలిపి త్రాగడానికి ఇష్టపడతారు. ఇది కిడ్నీపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి దీన్ని అస్సలు చేయకండి.
బొప్పాయి నిమ్మ
పండ్లలో నిమ్మరసం మిక్స్ చేయడం చాలా మందికి ఇష్టం. బొప్పాయి నిమ్మరసం రెండూ జీర్ణక్రియకు మంచివి. కానీ ఇది ప్రమాదకరమైన కలయిక అని గుర్తుంచుకోండి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ అసమతుల్యత, రక్తహీనతకు కారణమవుతుంది.