Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్‌ లేనట్లే..!

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్‌ లేనట్లే..!

Update: 2022-06-18 07:30 GMT

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్‌ లేనట్లే..!

Health Tips: శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. మరోవైపు నీటి కొరత ఉంటే అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుంది. నీటి కొరత వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఇది కాకుండా ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.

పొడి చర్మం

శరీరంలో నీరు లేకపోవడం వల్ల చాలా మంది చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇలా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. సరిపడ నీటిని తాగాలి.

పెదవులపై స్కాబ్స్

పెదవులపై స్కాబ్స్‌ కూడా నిర్జలీకరణ చర్మం లక్షణం. శరీరంలో నీటి కొరత కారణంగా పెదవులపై స్కాబ్స్ అంటే చనిపోయిన చర్మ కణాలు ఏర్పడుతాయి.

చర్మంపై దురద

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి కొరత కారణంగా మీరు చర్మంపై దురద, కురుపులు వంటి లక్షణాలను చూడవచ్చు. దీంతో పాటు మీ చర్మంపై దద్దుర్లు సమస్య మొదలవుతుంది.

ముడతలు

ముఖం, చేతులపై ముడతలు లేదా చర్మం కుంచించుకుపోవడం జరుగుతుంది. ఇది నీటి కొరత లక్షణం. వెంటనే తగినన్ని నీరు తాగాలి.

Tags:    

Similar News