Death Signs: మరణానికి ముందు ఈ సంకేతాలు.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Death Signs: మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే.

Update: 2022-11-09 13:54 GMT

Death Signs: మరణానికి ముందు ఈ సంకేతాలు.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Death Signs: మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. అయితే ఇప్పటివరకు ఒక వ్యక్తి ఎప్పుడు, ఎలా మరణిస్తాడో స్పష్టంగా చెప్పలేకపోయారు. కానీ ఇటీవల శాస్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృత్యువు రాకముందే దాని సంకేతాలు అనేక రకాలుగా తెలుస్తాయని గుర్తించారు. వైద్యరంగంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ సాధారణ వ్యక్తులకు ఇవి తెలియవు. అవి ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇటీవల UKలో కొంతమంది శాస్త్రవేత్తలు ఒక పరిశోధన నిర్వహించారు. దీనిప్రకారం.. మరణం సమీపిస్తున్నప్పుడు ఎవరైనా ఆహారం, పానీయాలు తగ్గిస్తాడని చెప్పారు. అంతేకాదు ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడుతాడు. అయితే దీనికి విరుద్దంగా చిన్న వయస్సులోనే మరణించే పిల్లవాడు మాత్రం ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా తినడం చేస్తాడని చెప్పారు.

మరణానికి 2 వారాల ముందు

నివేదిక ప్రకారం మరణానికి 1-2 వారాలు మిగిలి ఉన్నప్పుడు మరణం లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో సదరు వ్యక్తి అన్ని సమయాలలో అలసట, నీరసంగా కనిపిస్తాడు. అతను చాలా బలహీనంగా మారుతాడు. ఎంత ప్రయత్నించినా మంచం విడిచి పెట్టడానికి ధైర్యం చేయలేడు. అతని నిద్ర-మేల్కొనే విధానం మారుతుంది. అతని ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస విధానంలో మార్పులు కనిపిస్తాయి.

మలమూత్ర విసర్జన ఆగిపోతుంది

మూడు నాలుగు రోజులలో మరణం సంభవిస్తుందన్న సమయంలో ఆ వ్యక్తి భయ భ్రాంతులకి గురవుతాడు. ప్రజలు చెప్పేదానికి ఖచ్చితంగా స్పందించలేడు. అతను మరణించే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అతని చేతులు, కాళ్ళపై చర్మం నీలిరంగు-ఊదా రంగులోకి మారుతుంది. మూత్రవిసర్జన, ప్రేగు కదలికలను ఆపుతారు. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

Tags:    

Similar News