Kitchen Spices: ఈ వంటగది మసాలాలు లంగ్స్‌ను క్లీన్ చేస్తాయి.. శ్వాసకోశ సమస్యలను నయం చేస్తాయి..!
Kitchen Spices: ఇంట్లో ఉండే వంటగదిని ఔషధాల పుట్టగా చెప్పవచ్చు.
Kitchen Spices: ఇంట్లో ఉండే వంటగదిని ఔషధాల పుట్టగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాధిని నయం చేసే మసాలాలు ఉంటాయి. వీటిలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా లభిస్తాయి. వాడే పద్దతి తెలియాలి కానీ చాలా వ్యాధులను నయం చేసుకోవచ్చు. అంతేకాదు వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మసాలాలు ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాదు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వంటగదిలో లభించే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఊపిరితిత్తులను క్లీన్ చేస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పసుపు
కూరలలో వాడే పసుపులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. తద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే పసుపు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి రక్షించబడతారు.
అల్లం
అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అల్లంలో చాలా పోషకాలు ఉంటాయి. జింజెరాల్ అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది. ఇది శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే లక్షణాలు అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడంలో పనిచేస్తాయి. ఇది ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వెల్లుల్లిలో ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది. కాబట్టి శ్వాసకోశ సమస్యలలో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.
ఒరేగానో
అనేక వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది.