Kidneys Functioning: ఈ ఆహారాలు కిడ్నీలను క్లీన్ చేస్తాయి.. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి..!

Kidneys Functioning: శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఇవి రక్తాన్ని వడబోసి అందులో ఉండే మలినాలను యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి.

Update: 2024-05-30 16:00 GMT

Kidneys Functioning: ఈ ఆహారాలు కిడ్నీలను క్లీన్ చేస్తాయి.. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి..!

Kidneys Functioning: శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఇవి రక్తాన్ని వడబోసి అందులో ఉండే మలినాలను యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి. ఒక విసర్జక వ్యవస్థలా పనిచేస్తాయి. ఇవి చెడిపోయాయంటే బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయి మనిషి అనారోగ్యానికి గురై చనిపోతాడు. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మీకు తక్కువ మూత్రవిసర్జన, యూరిన్ యెల్లో కలర్లో రావడం, వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటే కిడ్నీలు డేంజర్లో ఉన్నాయని అర్థం చేసుకోండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే కిడ్నీల ఆరోగ్యం కోసం కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకోండి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నీళ్లు

మూత్రపిండాలకు నీరు అత్యంత అవసరం. ఇది శరీరం నుంచి టాక్సిన్స్, మురికిని తొలగించడంలో సాయపడుతాయి. తగినంత నీరు తాగడం వల్ల మూత్రపిండాలు బాగా పని చేస్తాయి. కిడ్నీలో స్టోన్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నించాలి.

వెల్లుల్లి

వెల్లుల్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సాయపడుతాయి. శరీరం నుంచి విషాన్ని తొలగించే ప్రక్రియను వేగవంతం చేసే సల్ఫర్ మూలకాలు ఇందులో ఉంటాయి. రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు తాజా వెల్లుల్లిని సూప్‌లు, సాస్‌లు లేదా కాల్చిన కూరగాయలలో ఉపయోగించవచ్చు.

పసుపు

పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఒక మసాలా పదార్థం. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కిడ్నీలను గాయం నుంచి రక్షించడంలో, వాపును తగ్గించడంలో సాయపడుతాయి. మీరు పసుపును కూరలు, సూప్‌లు వాడవచ్చు. పాలలో వేసుకొని తాగవచ్చు.

ఆమ్ల ఫలాలు

నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, సిట్రేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతాయి. సిట్రస్ పండ్లు మూత్రం ఆమ్లతను పెంచుతాయి. రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లను డైరెక్ట్గా లేదా నీటిలో వాటి రసాన్ని కులపుకొని తీసుకుంటే మంచిది.

పచ్చని ఆకు కూరలు

తోటకూర, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదనంగా వాటిలో తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి మంచిది.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News