Health Tips: కిడ్నీలో రాళ్లకి ఈ ఆహారాలే కారణం.. దూరంగా ఉంటే మంచిది..!

Health Tips: కిడ్నీలో రాళ్లకి ఈ ఆహారాలే కారణం.. దూరంగా ఉంటే మంచిది..!

Update: 2022-12-18 15:00 GMT

Health Tips: కిడ్నీలో రాళ్లకి ఈ ఆహారాలే కారణం.. దూరంగా ఉంటే మంచిది..!

Health Tips: ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇందులో అన్ని వయసుల వారు ఉంటున్నారు. మొదట్లో కిడ్నీస్టోన్‌ లక్షణాలు ఏమి కనిపించవు. కానీ సమయం గడిచేకొద్దీ సమస్య పెరుగుతుంటుంది. కిడ్నీ స్టోన్ కారణంగా విపరీతమైన నొప్పి వస్తుంది. కిడ్నీలో రాళ్లకు చాలా కారణాలు ఉంటాయి. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, అధిక బరువు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పొరపాటున కూడా వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.

కిడ్నీ స్టోన్ కారణాలు

కిడ్నీ స్టోన్ సమస్యకి చాలా కారణాలు ఉంటాయి. ఈ సమస్య మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో బయటి ఆహారాలు, అదనపు చక్కెర, ఉప్పు, ప్రోటీన్‌లకు దూరంగా ఉండాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతో పాటు వ్యాయామం, యోగా వంటివి జీవనశైలిలో చేర్చుకోవాలి.

ఇవి సమస్యను పెంచుతాయి

గొడ్డు మాంసం, చికెన్, గుడ్లు, పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర మొదలైనవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. దీని కారణంగా కిడ్నీ స్టోన్ ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది. కడుపులో భరించలేని నొప్పి, మూత్రంలో రక్తం, జ్వరం, వాంతులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కిడ్నీ స్టోన్స్‌ నివారణ

కిడ్డీ స్టోన్స్ వంటి సమస్యలను నివారించడానికి శరీరంలో నీటి కొరత ఉండకూడదు. ఇందుకోసం రోజంతా కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు పళ్ల రసాలను ఆహారంలో చేర్చుకోవాలి.

Tags:    

Similar News