Health Tips: షుగర్‌ పేషెంట్లకు ఈ పానీయాలు దివ్యవౌషధమే.. అవేంటంటే..?

Health Tips: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మధుమేహ రోగులు పెరుగుతున్నారు. ఈ పరిస్థితి భారతదేశంలో ఎక్కువగా ఉంది.

Update: 2024-03-11 02:30 GMT

Health Tips: షుగర్‌ పేషెంట్లకు ఈ పానీయాలు దివ్యవౌషధమే.. అవేంటంటే..?

Health Tips: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మధుమేహ రోగులు పెరుగుతున్నారు. ఈ పరిస్థితి భారతదేశంలో ఎక్కువగా ఉంది. దీనికి కారణం జీవన విధానమే. మధుమేహం అనేది ఒక ధీర్ఘకాలిక వ్యాధి దీనికి సరైన మందులు లేవు. అయితే జీవన విధానంలో మార్పులు చేయడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా వీరు కచ్చితమైన డైట్‌ పాటించాలి. తినే ఆహార పదార్థాలు, తాగే పానీయాలపై దృష్టిపెట్టాలి. ఈ రోజు మధుమేహ బాధితులు తాగే మూడు పానీయాల గురించి తెలుసుకుందాం.

పసుపు పాలు

టైప్ 2 డయాబెటిస్ రోగులు టిఫిన్‌లో పాలు తాగడం ఉత్తమం. ఇవి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను తగ్గిస్తాయి. అయితే పసుపు పాలు తాగాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా మంచివి. వీటిని తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.

దాల్చిన చెక్క పాలు

దాల్చిన చెక్క పాలు డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. అధిక ఆహారం తీసుకోకుండా కంట్రోల్ చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి.

బాదం పాలు

బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ డి, విటమిన్ ఇ, అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని తాగడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసిపోకుండా పనిచేసుకుంటారు.

Tags:    

Similar News