Health Tips: క్యాన్సర్ కణాలని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే.. డైట్‌లో ఉండాల్సిందే..!
* సరైన డైట్ పాటించడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. ఇవి క్యాన్సర్‌ని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి
Health Tips: క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. దీని పేరు వినగానే జనాలు వణికిపోతారు. అయితే సరైన డైట్ పాటించడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. ఇవి క్యాన్సర్‌ని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పండ్లు, బ్రోకలీ, టమోటాలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి ఫంగస్, బ్యాక్టీరియా వంటి ఇతర ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే మూలకాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి ఏ ఆహార పదార్థం క్యాన్సర్‌ను వ్యాపించకుండా నిరోధించదు. కానీ క్రమం తప్పకుండా కొన్ని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
పసుపు:
మనందరం నిత్య జీవితంలో పసుపును ఉపయోగిస్తాం. ఇందులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణశయాంతర, చర్మ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
టొమాటో:
టొమాటో ఔషధాల నిధి. గుండె జబ్బులు, ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణలో ఇది సహాయపడుతుంది. ఇది లైకోపీన్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా దాని రంగు ఎరుపుగా ఉంటుంది. లైకోపీన్ ఉన్న ఆహార పదార్థాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వాల్‌నట్స్:
వాల్‌నట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంది. టోకోఫెరోల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ పదార్థాలతో కూడిన వాల్‌నట్‌లు కణితులు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్, విటమిన్-ఈ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కణాల ఈస్ట్రోజెన్ గ్రాహకాలను ఫైటోస్టెరాల్స్ ద్వారా ఆపవచ్చు.
వెల్లుల్లి:
క్యాన్సర్‌ను నివారించే శక్తి వెల్లుల్లికి ఉందని నమ్ముతారు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు బ్రేకులు వేస్తుంది. దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు.