Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే..

Overthinking: ప్రస్తుత గజిబిజీ జీవితంలో అంతా యాంత్రికంగా మారిపోయింది. ఉదయం లేచించి మొదుల రాత్రి పడుకునే వరకు ఒత్తిడితో సావాసం చేయకతప్పని పరిస్థితి.

Update: 2024-10-11 04:37 GMT

Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే..

Overthinking: ప్రస్తుత గజిబిజీ జీవితంలో అంతా యాంత్రికంగా మారిపోయింది. ఉదయం లేచించి మొదుల రాత్రి పడుకునే వరకు ఒత్తిడితో సావాసం చేయకతప్పని పరిస్థితి. దీంతో ఇది మానసిక సమస్యలకు సైతం దారి తీస్తోంది. ముఖ్యంగా అతిగా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న సమస్యను కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు. కాలికి దెబ్బ తగిలినా.. ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందుతున్నారు.

ఇలా అతిగా ఆలోచించడం కూడా మానసిక సమస్యకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆలోచించడం వల్ల ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఈ కారణంగా నిద్రలేమి, తలనొప్పి, అధిక రక్తపోటుతో పాటు ఇత శారీరక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆందోళన, గుండెదడ పెరగడం ఇలాంటివన్నీ అతిగా ఆలోచించడం తాలుకూ లక్షణంగా చెప్పొచ్చు. అయితే అతిగా ఆలోచించడాన్ని క్రమంగా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అతిగా ఆలోచించడం సమస్య నుంచి బయటపడాలంటే.. యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కచ్చితంగా 15 నుంచి 20 నిమిషాలైనా కళ్లు మూసుకొని శ్వాసపై ధ్యాస పెట్టాలి. ప్రతికూల ఆలోచనల నుంచి బయటకు వచ్చేందుకు మార్గాలను అన్వేషించాలి. ఏదో జరిగిపోతుందన్న భయం నుంచి బయటకు రావాలి.

ఇక సాధారణంగా అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణాలు.. గతం గురించి బాధ పడడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడమే ఉంటాయి. అందుకే ప్రస్తుతంలో జీవించడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అన్ని బాధలను వదిలేసి వర్తమానాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుత కాలాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. ఎప్పుడూ ఒక్కరే ఒంటరిగా ఉండకూడదు. నలుగురితో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి.

పాజిటివ్‌ ఆలోచనతో ముందుకు వెళ్లాలి. మీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. సమస్యల గురించి ఆలోచించి బాధపడేకంటే వాటి పరిష్కారం దిశగా ఆలోచించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఎలాంటి సందేహం లేకుండా మానసిక నిపుణులను సంప్రదించాలి. వారి వీటికి సరైన చికిత్స అందిస్తారు. 

Tags:    

Similar News