Nails: గోర్లపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా.? ఈ సమస్యలు ఉన్నట్లే..

గోర్లపై తెలుపు రంగు చారలు కనిపించడం ల్యూకోనీషియా అనే వ్యాధికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-08-30 10:04 GMT

Nails: గోర్లపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా.? ఈ సమస్యలు ఉన్నట్లే..

మన ఆరోగ్యాన్ని శరీరంలో జరిగే మార్పుల ఆధారంగా అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లలో, చేతి గోర్లలో కనిపించే మార్పుల ఆధారంగా శరీరంలో అనారోగ్య సమస్యలు ఇట్టే పసిగట్టవచ్చు. మనలో కొందరి చేతి గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుండడం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా తెలుపు రంగు చారలు ఏర్పడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సంకేతం దేనికి సూచనో ఇప్పుడు తెలుసుకుందాం..

గోర్లపై తెలుపు రంగు చారలు కనిపించడం ల్యూకోనీషియా అనే వ్యాధికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గోరుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తెలుపు మచ్చలు కన్పిస్తాయి. అయితే దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే కొన్ని సందర్భాల్లో కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ లోపమున్నప్పుడు కూడా తెలుపు మచ్చలు కన్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా తెలుపు మచ్చలకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు క్రానిక్ కిడ్నీ వ్యాధుల్లో కూడా గోర్లపై తెలుపు మచ్చలు కన్పిస్తాయని అంటున్నారు. లివర్‌ సంబంధిత సమస్యల కారణంగా కూడా గోర్లపై తెలుపు మచ్చలుంటాయని చెబుతున్నారు. ఇక గోర్లపై తెల్లటి మచ్చలు రావడానికి హార్ట్ ఎటాక్ వచ్చే ముందు గోర్లపై రంగు మారడం కూడా కారణమవుతుండొచ్చని అంటున్నారు. డయాబెటిస్ రోగులకు గోర్ల రంగు తెలుపుగా మారుతుంది.

ఇక గోర్లు లావుగా మారినా, తరచూ విరిగిపోతున్నా, గోర్లలో చారలు ఏర్పడటం, గోర్లు ఊడిపోవడం వంటివి కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతుండొచ్చని నిపుణులు అంటున్నారు. గోర్లపై ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత చికిత్సలు చేయించుకోవాలి. అలాగే నిత్యం శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఇంటర్నెట్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు అందించాము. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News