Food: చూడ్డానికి బాలేవని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

అయితే చూడ్డానికి బాలేవని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-08-29 08:48 GMT

Food: చూడ్డానికి బాలేవని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు 

కిస్మిస్‌లు సర్వసాధారణంగా దొరికేవే. అయితే మనలో చాలా మంది బ్లాక్‌ కిస్మిస్‌లను తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బ్లాక్‌ కిస్మిస్‌లతో పోల్చితే బ్రౌన్‌ కలర్‌లో ఉండే కిస్మిస్‌లను తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే చూడ్డానికి బాలేవని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్లాక్‌ కిస్మిస్‌లను ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుతం ఐరన్‌ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే కచ్చితంగా బ్లాక్‌ కిస్మిస్‌లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రక్తం పెరగడంలో కిస్మిస్‌లు ఉపయోగపడతాయి.

* ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్లాక్‌ కిస్మిస్‌లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారికి బ్లాక్ కిస్మిస్ చాలా మంచిది. బ్లాక్ కిస్మిస్‌తో ఎముకలకు బలం చేకూరుతుంది.

* రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వార్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలంటే బ్లాక్‌ కిస్మిస్‌లను తీసుకోవాలని నిపునులు చెబుతున్నారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా నల్ల ఎండు ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పుష్కలంగా లభించే పొటాషియం, విటమిన్‌ సి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిలోని విటమిన్‌ సి ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* మలబద్ధకం, పైల్స్‌ వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా బ్లాక్‌ కిస్మిస్‌లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. వీటిలోని ఫైబర్ పేగు కదలికను ప్రోత్సహిస్తుంది. కిస్‌మిస్‌ తింటే.. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

* బ్లాక్‌ కిస్మిస్‌లను తీసుకునే విధానంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిస్మిస్‌లను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. నాన బెట్టిన నీటిని తాగడం వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News