Ovarian Cancer: మహిళలూ జాగ్రత్త.. ఈ లక్షణాలు అండశయ క్యాన్సర్‌కు చిహ్నాలు కావొచ్చు..!
Ovarian Cancer: ఇటీవల క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంక్య క్రమంగా పెరుగుతోంది.
Ovarian Cancer: ఇటీవల క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంక్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో అండాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయి. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇంతకీ అండశయ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* అండాశయ క్యాన్సర్ వస్తే కనిపించే సాధారణ లక్షణాల్లో పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి ఒకటి. దీర్ఘకాలంగా పొత్తి కడుపు దిగువ భాగంలో నిరంతర నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది. ముఖ్యంగా భోజనం తర్వాత లేదా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యుల సూచనలు పాటించాలి.
* ఇక కడుపులో తరచుగా వాపు లేదా ఉబ్బినట్లు కనిపించినా వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* త్వరగా కడుపు నిండిన భావన కలిగినా, ఆకలి లేకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తే, అస్సలు ఆకలి లేకపోయినా.. అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణంగా చెప్పొచ్చు.
* ఇక తరచూ మూత్ర విసర్జన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటే అండాశయ క్యాన్సర్ ప్రాథమిక లక్షణంగా భావించాలి.
* మలబద్ధకం లేదా అతిసారం కూడా అండాశయ క్యాన్సర్ ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. ఎలాంటి కారణంగా లేకుండా ఈ సమస్యలు ఎదురైతే అండశయ క్యాన్సర్ సంకేతంగా భావించాలి.
* పీరియడ్స్ సమయంలో లేదా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా రక్తస్రావం అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి పాటించండి..
* 50 ఏళ్లు పైబడిన మహిళలు క్రమంతప్పకుండా గైనకాలజిస్ట్‌తో నిత్యం పరీక్షలు చేయించుకోవాలి. మీ కుటుంబంలో అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నట్లయితే, దాని గురించి వైద్యుడికి వివరించాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.