White Hair: చిన్న వయసులో తెల్లజుట్టు రావడానికి ఇవే కారణాలు.. అవేంటంటే..?

White Hair: వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లగా మారడం సహజ ప్రక్రియ.

Update: 2023-02-27 14:30 GMT

White Hair: చిన్న వయసులో తెల్లజుట్టు రావడానికి ఇవే కారణాలు.. అవేంటంటే..?

White Hair: వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లగా మారడం సహజ ప్రక్రియ. 50 సంవత్సరాల వయసు తర్వాత అందరికి జుట్టు తెల్లగా మారుతుంది. కానీ ప్రస్తుత యుగంలో 20 నుంచి 25 సంవత్సరాల యువతకి కూడా జుట్టు నెరిసిపోతుంది. టెన్షన్ వల్ల జుట్టు తెల్లబడుతుందని చాలామంది చెబుతున్నారు. ఇది కొంత వరకు నిజమే. కానీ జుట్టు నెరిసిపోవడం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.

శరీరంలోని మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం వల్ల జుట్టు దాని రంగును పొందుతుంది. మెలనిన్ మెలనోసైట్‌ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇవి చర్మం ఉపరితలంపై ఉండే ప్రత్యేక వర్ణద్రవ్యం కణాలు. వీటి ద్వారా జుట్టు పెరుగుదల జరుగుతుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల ఈ మెలనిన్‌ తగ్గిపోతుంది. దీంతో జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఆ కారణాలని సకాలంలో గుర్తిస్తే జుట్టు తెల్లగా మారడాన్ని ఆపవచ్చు. అవేంటో చూద్దాం.

తెల్ల జుట్టు రావడానికి కారణాలు

1. జన్యుపరమైన కారణాలు

2. విటమిన్ బి12 లోపం

3. పెర్నిషియస్ అనీమియా

4. క్వాషియోర్కర్ వల్ల ప్రొటీన్ నష్టం

5. ఐరన్, కాపర్ లోపం

6. హైపోథైరాయిడిజం

7. మెడికల్ హెయిర్ ఆయిల్ వాడకం

8. కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం

9. బుక్స్ సిండ్రోమ్

10. డౌన్ సిండ్రోమ్

11. వెర్నర్ సిండ్రోమ్

12. టెన్షన్

13. వైట్ స్పాట్స్

పైన ఉన్న ఏదో ఒక కారణం వల్ల జుట్టు నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. మీ జుట్టు తెల్లగా మారుతుందంటే ఇందులో ఏదో ఒక సమస్య ఉందని అర్థం. దానిని సకాలంలో గుర్తించి నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. కొన్ని రోజులలో జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది.

Tags:    

Similar News