Health Tips: ఈ 5 పండ్లతో చెడు కొలస్ట్రాల్‌కి చెక్.. గుండెపోటు సమస్యలు దూరం..!

Health Tips: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గడంతో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు.

Update: 2023-08-18 15:30 GMT

Health Tips: ఈ 5 పండ్లతో చెడు కొలస్ట్రాల్‌కి చెక్.. గుండెపోటు సమస్యలు దూరం..!

Health Tips: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గడంతో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. కొవ్వులో 2 రకాలు ఉంటాయి. ఇందులో మంచి కొలస్ట్రాల్‌ పర్వాలేదు కానీ చెడు కొలస్ట్రాల్‌ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త సరఫరాకి అడ్డంకిగా మారుతుంది. ఈ పరిస్థితిలో రక్తం గుండెకు చేరుకోవడం చాలా కష్టమవుతుంది. దీని కారణంగా హై బీపీ, డయాబెటీస్‌, ఊబకాయం, గుండెపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. వీటిని నివారించాలంటే రోజువారీ డైట్‌లో కొన్ని రకాల పండ్లని చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

అవకాడో

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అవకాడో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్‌ అవుతుంది. దీని వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది.

ఆపిల్

యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. పెక్టిన్ అనే కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే జామపండును కూడా తీసుకోవచ్చు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అధికంగా ఉండే కొవ్వుని కరిగిస్తుంది.

అరటిపండు

అరటిపండు సంవత్సరం పాటు తినవచ్చు. ఇందులో పొటాషియం, పీచు పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది. గొప్ప విషయం ఏంటంటే ఇది రక్తపోటును సాధారణీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఆరెంజ్‌

ఆరెంజ్ విటమిన్-సి ఉత్తమ వనరుగా చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో రక్త సరఫరాను సాఫీగా చేయడంలో ఆరెంజ్‌కు సాటి లేదు. గుండె జబ్బులు ఉన్నవారు ఆరెంజ్‌ తప్పక తినాలి.

బెర్రీలు

బెర్రీలు వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

Tags:    

Similar News