Rainy Season: వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు గమనించకుంటే ప్రాణాలు పోతాయ్‌..!

Rainy Season Diseases: కలరా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. త్వరగా చికిత్స అందకపోతే రోగి ప్రాణాలు పోతాయి.

Update: 2023-07-12 10:30 GMT

Rainy Season: వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు గమనించకుంటే ప్రాణాలు పోతాయ్‌..!

Rainy Season Diseases: వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టిరియాని కూడా మోసుకొస్తుంది. ఈ సీజన్‌లో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చాలా రకాల బ్యాక్టీరియా యాక్టివ్‌గా మారుతుంది. దీంతో చాలామంది బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతారు. అయితే వర్షాకాలంలో ముఖ్యంగా V. కలరా (విబ్రియోకలరా) అనే బ్యాక్టీరియా చురుకుగా మారుతుంది. దీనివల్ల చాలామంది కలరా వ్యాధికి గురవుతారు. కలరా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. త్వరగా చికిత్స అందకపోతే రోగి ప్రాణాలు పోతాయి.

వి కలరా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి ఆరు గంటలలోపే కలరా లక్షణాలు కనిపిస్తాయి. కలరా కలిగించే బ్యాక్టీరియా మురికి నీరు, సముద్రపు ఆహారం, పచ్చి పండ్లలో వృద్ధి చెందుతుంది. వీటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. గొంతు నుంచి వచ్చే ఈ బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లి పొట్టలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత సకాలంలో చికిత్స చేయకపోతే రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది.

కలరా యొక్క లక్షణాలు

కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియా పేగుల్లోకి ప్రవేశించిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే వేర్వేరు వ్యక్తులలో వేర్వేరు లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామందిలో విరేచనాలు మొదలవుతాయి. ఇది చాలా రోజులు నిరంతరం కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో ఎవరైనా డయేరియా సమస్యతో బాధపడుతుంటే తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వాంతులు, అధిక దాహం

వాంతులు, అధిక దాహం కూడా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా చుట్టూ మురికి నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటే వాంతులు ఎక్కువగా జరుగుతాయి. ఈ సమస్య నిరంతరం కొనసాగితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. వాంతులు కాకుండా విపరీతమైన దాహం అనిపిస్తే ఇది కలరా మరొక లక్షణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కలరా వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి దాహం విపరీతంగా పెరిగిపోతుంది.

Tags:    

Similar News