Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే..!

Health Tips: శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి.

Update: 2022-12-06 14:00 GMT

Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే..!

Health Tips: శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇందులో చిన్న సమస్య ఏర్పడినా జీవితం నాశనమవుతుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ క్షీణిస్తుంది. దీని కారణంగా అనేక కడుపు వ్యాధులు సంభవిస్తాయి. కాలేయం శరీరం మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. మీ లివర్ ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.. కాలేయంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే శరీరంలో కొన్ని లక్షణాలు ఏర్పడుతాయి. వీటిని అస్సలు విస్మరించకూడదు. అవేంటో తెలుసుకుందాం.

వాంతులు

కాలేయంలో సమస్య ఏర్పడితే వికారం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఎందుకంటే కాలేయం దెబ్బతిన్నప్పుడు అది విషాన్ని ఫిల్టర్ చేయలేదు. దీని వల్ల వాంతులు మొదలవుతాయి.

చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం

కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే చర్మం, కళ్ళ రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఎందుకంటే కాలేయంలో సమస్య ఏర్పడినప్పుడు రక్తంలో బిలిరుబిన్ అనే రసాయనం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం రంగులో మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు కాలేయంలో సమస్య ఉన్నప్పుడు చర్మంపై క్రస్ట్ ఏర్పడుతుంది. దురద కూడా వస్తుంది. ఇది కాకుండా కళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది.

కడుపు ఉబ్బరం

కడుపు ఉబ్బరం కాలేయ వైఫల్యానికి సంకేతం. ఎందుకంటే కాలేయం పనిచేయకపోవడం వల్ల కడుపులో ద్రవం ఎక్కువైపోతుంది. దీని కారణంగా కడుపు ఉబ్బడం ప్రారంభమవుతుంది. అంతేకాదు పాదాలు, చీలమండలలో వాపు ఏర్పడుతుంది.

Tags:    

Similar News