How To Identify Real Orange: ఆరెంజ్ పేరుతో టాన్జేరిన్ విక్రయాలు.. నిజమైన ఆరెంజ్‌ను గుర్తుపట్టండిలా..!
How To Identify Real Orange: చలికాలంలో మార్కెట్‌లో ఆరెంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు జనవరి నుంచి మార్చి వరకు అధికంగా లభిస్తాయి.
How To Identify Real Orange: చలికాలంలో మార్కెట్‌లో ఆరెంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు జనవరి నుంచి మార్చి వరకు అధికంగా లభిస్తాయి. ఈ సీజన్‌లో వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే చలి కాలంలో ఆరెంజ్‌తో పాటు దానిలాగే కనిపించే ఇతర పండ్లు కూడా లభిస్తాయి. వీటినే టాన్జేరిన్లు, మాల్టా అని పిలుస్తారు. ఈ రెండు పండ్లు సరిగ్గా ఆరెంజ్‌లాగే ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆరెంజ్ అనుకొని టాన్జేరిన్లు కొనుగోలు చేస్తారు. కానీ ఈ మూడు పండ్లు చాలా భిన్న గుణాలను కలిగి ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ధరలో తేడా
ఎవరైన పండ్లు కొనడానికి షాప్‌కు వెళితే ముందుగా వాటి ధర కనుక్కుంటారు. రూ.100 కి కిలో అమ్మే ఆరెంజెస్ 2 కిలోలు వస్తున్నాయంటే ఎగబడి మరీ కొంటారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే అవి ఆరెంజెస్ కాదని. విక్రయదారుడు ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించడు. ఎందుకంటే అతడి గిరాకీ దెబ్బతింటుంది. అందుకు నిజమైన ఆరెంజెస్ ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
నారింజ, టాన్జేరిన్‌లు రెండు చూడడానికి ఒకే రంగులో ఉంటాయి. అయితే టాన్జేరిన్, మాల్టా భిన్నమైన ఆకృతిలో ఉంటాయి. ఆరెంజ్ మాత్రం గుండ్రని ఆకారంలో పొడవుగా ఉంటుంది. ఈ రెండు పండ్లు గుండ్రంగానే ఉంటాయి. నిజమైన ఆరెంజ్ తొక్క తీసిన వెంటనే అది పూర్తిగా తొలగిపోతుంది. లోపల ఉన్న ఆరెంజ్ స్లైస్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ టాన్జేరిన్, మాల్టా తొక్క తొలగించబడినప్పుడు లోపల వైట్ పొర ఒకటి ఉంటుంది. వాటిని తీసేసి తినాల్సి ఉంటుంది. అప్పుడు తెలిసిపోతుంది అవి ఆరెంజెస్ కాదని.
రుచిలో కూడా తేడా ఉంది..
ఈ మూడు పండ్ల రుచిలో కూడా తేడా ఉంటుంది. ఆరెంజ్ తీపి అయితే మాల్టా, టాన్జేరిన్ రుచిలో తీపి అలాగే చేదు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అతిపెద్ద విషయం ఏంటంటే ఆరెంజెస్ ధర ఎక్కువగా ఉంటుంది వీటితో పోల్చితే టాన్జేరిన్ మార్కెట్లో చౌకగా లభిస్తాయి.