Relationship: భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే దంపతులే కాదట..సూధామూర్తి ఏం చెప్పారంటే?
Relationship:
Relationship:ప్రేమలేని బంధం నిలబడదు. ముఖ్యంగా దాంపత్య బంధంలో ప్రేమ లేకుంటే అది చిరకాలం ఉండదు. ప్రేమ ఉంటేనే దంపతులు ఆనందంగా జీవిస్తారు. అయితే భార్యభర్తలు సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే వారి మధ్య కచ్చితంగా గొడవలు జరగాలని చెబుతున్నారు సుధామూర్తి. అలా దంపతులు గొడవలు పడినప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరగుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సుధామూర్తి..రచయిత్రి, పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్. ఆమె రచయిత్రి మాత్రమే కాదు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరు కూడా ఉంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో భార్యభర్తల మధ్య ఉండే రిలేషన్ గురించి చక్కటి వివరణ ఇచ్చారు. భార్యభర్తలు గొడవపడాలని..ఎప్పుడూ గొడవలు పడకపోతే భార్యభర్తలుగా ఉండలేమన్నారు. భార్యభర్తలైతే గొడవలు సహజం. అలా జరిగితేనే ఆ బంధంలో ప్రేమ ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్థలు, గొడవల కారణంగా ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదంటారు సుధామూర్తి.
దంపతులు కొట్లాడినప్పుడు ఒకరికి విసుగువస్తుంది. అవతలి వ్యక్తి కూల్ గా ఉండాలి. నారాయణమూర్తికి కోపం వచ్చినప్పుడు మాట్లాడనని..మౌనంగా ఉంటానని చెప్పారు. దీంతో గొడవలు త్వరగా ముగిసి కుటుంబమంతా అందంగా, సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఇక జీవితం అనేది...ఎవరికీ పరిపూర్ణమైన జీవితం లేదు. పరిపూర్ణ జంటలు కూడా లేరు. ఇద్దరిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. రెండింటిని అర్థం చేసుకుంటేనే జీవితంగా అందంగా ఉంటుంది. భాగస్వామి మంచి అలవాట్లను అంగీకరించినట్లే వారి చెడు లక్షణాలలో కొన్నింటిని అంగీకరించాలి. వీలైతే వారు చాలా చెడ్డగా ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. కానీ వారు కూడా మీలాగా మారిపోవాలని ఎప్పుడూ అనుకోకూడదు.
ప్రతి పురుషుడు తన భార్యకు వంటగదిలో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అని సూధామూర్తి చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది.భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావచ్చు.కానీ భార్య తన ఉద్యోగం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి వంట చేసి పీటీఎ మీటింగులకు హాజరవుతుంది. భార్య భారాన్ని భర్త పంచుకోవాలి. అప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. మీరు నగరంలో నివసిస్తున్నారు. మీ ఇద్దరికీ కోరికలు ఉంటాయి. కోరికలతోపాటు మీరు మీ సమస్యలను కూడా పంచుకోవాలని చెప్పుకొచ్చారు సుధామూర్తి.
అమ్మ చేతి వంట అంటే అందరికీ ఇష్టం. కానీ కొంతమంది మా వంట బాగా చేస్తుంది..మా అమ్మ చేసిన వంట రుచే లేదు అంటూ భార్యను ఇబ్బంది పెడుతుంటారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. రుచికరమైన వంట చేసి వడ్డిస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటి పని, ఆఫీసు పని, కుటుంబ బాధ్యతలను మోస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిలా వంట చేస్తుందని మీరు ఎలా ఆశిస్తారని సుధామూర్తి ప్రశ్నించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.