Soak Almonds: బాదంపప్పు నానబెట్టి తినండి.. శరీరానికి ఈ ప్రయోజనాలు అందుతాయి..!
Soak Almonds: ప్రతిరోజు పరగడుపున 12 నుంచి 20 నానబెట్టిన బాదంపప్పులను తింటే మంచి శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు.
Soak Almonds: ప్రతిరోజు పరగడుపున 12 నుంచి 20 నానబెట్టిన బాదంపప్పులను తింటే మంచి శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు. బాదం తినడం వల్ల ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. బాదం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి కడుపు సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన చర్మం
బాదంలో విటమిన్ ఇ, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. కొల్లాజెన్‌ను పెంచడంలో పనిచేస్తాయి. చర్మాన్ని చల్లగా, మెరిసేలా చేస్తాయి.
కడుపు సమస్యల నుంచి ఉపశమనం
బాదంలో జీర్ణ శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మధుమేహం కంట్రోల్
బాదంలో ఒక రకమైన ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం ఉత్తమం.
అధిక బరువు
బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇది అధిక ప్రోటీన్, విటమిన్ ఎక్స్‌ట్రాక్ట్‌లను కలిగి ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కార్డియోవాస్కులర్ హెల్త్
బాదంపప్పులో సాధారణంగా నైట్రోజన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అద్భుత శక్తి
బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అద్భుత శక్తి లభిస్తుంది. ఇందులో అర్జినిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అందువల్ల చురుకైన జీవనశైలి కోసం బాదంపప్పులను తినాలి.
ముడతల తొలగింపు
బాదంలో విటమిన్ ఎ, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి శరీరంలో ముడతలను నివారిస్తాయి. వయసు పెరిగే కొద్దీ సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుంచి విటమిన్ ఎ శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే బాదంపప్పును తీసుకోవడం వల్ల కణజాలాలను యవ్వనంగా ఉంచుకోవచ్చు.