Sleep on The Floor: నేలపై పడుకుంటే ఆ కిక్కే వేరప్ప.. మంచం ఎత్తి బయట పడేస్తారు..!

Sleep on The Floor: మన పూర్వీకులు ఏ మంచంపై పడుకోలేదు. పట్టు పాన్పులపై నిద్రించలేదు.

Update: 2024-03-28 15:30 GMT

Sleep on The Floor: నేలపై పడుకుంటే ఆ కిక్కే వేరప్ప.. మంచం ఎత్తి బయట పడేస్తారు..!

Sleep on The Floor: మన పూర్వీకులు ఏ మంచంపై పడుకోలేదు. పట్టు పాన్పులపై నిద్రించలేదు. వారు నమ్ముకున్నది కేవలం నేలతల్లిని మాత్రమే. అందుకే వారికి నేలతో ఎక్కువ అటాచ్‌మెంట్‌ ఉంటుంది. దీనివల్లనే వారు ఆరోగ్యంగా జీవించారు వందేళ్లు బతికారు. కానీ నేటి ఆధునిక కాలంలో మనిషి సుఖాలకు అలవాటు పడి ఖరీదైన మంచాలపై సుతిమెత్తని పరుపులను వేసుకొని పడుకోవడం అలవాటు చేసుకున్నాడు. ప్రకృతికి దూరంగా నేలతల్లిని మరిచి దూరంగా నిద్రిస్తున్నాడు. దీనివల్లనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మళ్లీ నేలపై పడుకోవడం అలవాటు చేసుకోండి ఈ ప్రయోజనాలు పొందండి.

నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్‌ అవుతుంది. నేలతో అనుబంధం పెరుగుతుంది. శరీర భంగిమ సరైన రీతిలో, వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకపై ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైతే పిల్లోను వాడుకోవచ్చు. నేలపై పడుకో వడం వల్ల శరీరానికి కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపును నిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనస్సులోని ఆందోళనలు తగ్గుతాయి. మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. భూమితో అనుసంధానం చేయడం ద్వారా మరింత సమతుల్యత, ప్రశాంతతను పొందవచ్చు.

నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్రపడుతుంది. నిద్రలో సహజ శరీర కదలిక ఉంటుంది. మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా ఉంటుంది. నేల చల్లదనానికి శరీర వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు. అంతేకాదు చాలా మంది ఆఫీసు, ఇంటి పనితో అలసిపోతుంటారు. బాడీ పెయిన్స్ తో బాధ పడుతుంటారు. ఆ పెయిన్స్ ఉన్న వారు బెడ్ కి గుడ్‌ బై చెప్పి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News