India Post SMS Scam: ఇండియా పోస్ట్ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? స్పందించారో...

India Post SMS Scam: ఈ క్రమంలోనే తాజాగా ఇండియా పోస్ట్‌ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-21 07:09 GMT

Scam: ఇండియా పోస్ట్ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? స్పందించారో... 

Scam: రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు భౌతికంగా దాడులు చేసి డబ్బులు లాక్కునేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకో కొత్త రకం మోసం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియా పోస్ట్‌ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా మోసం. ఇందులో ప్రజలు ఎలా మోస పోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఉత్తరాలు లేకపోయినా.. పార్సిల్స్‌, ఏటీఎమ్‌ కార్డుల వంటి వాటిని ఇండియన్‌ పోస్ట్ ద్వారా బట్వాడా చేస్తున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. ఇండియన్‌ పోస్ట్ పేరుతో ముందుగా ఓ మెసేజ్‌ను పంపిస్తున్నారు. ఇందులో మీకు ఒక పార్సిల్ వచ్చిందని. అయితే ఇంటి అడ్రస్‌ సరిగా లేని కారణంగా డెలివరీ చేయలేకపోతున్నమంటూ, ఒక లింక్‌ను సైతం పంపిస్తున్నారు. 12 గంటల్లోపు ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి అడ్రస్‌ను అప్‌డేట్‌ చేయాలంటూ అందులో పేర్కొంటున్నారు.

అంతటితో ఆగకుండా కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోకపోతే పార్శిల్‌ డెలివరీ కాదంటూ భయపెడుతున్నారు. ఇంతకీ ఆ లింక్‌ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లింక్‌ను క్లిక్‌ చేయగానే మీరు మరో పేజీకి వెళ్తారు. అక్కడ రీడెలివరీ కోసం రూ.80 లేదా రూ.100 టోకెన్ మొత్తాన్ని చెల్లించాలని చెప్తారు. తక్కువ అమౌంట్‌ కావడంతో ప్రజలు తమ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను ఇవ్వడం ద్వారా చెల్లింపు చేస్తారు. దీంతో నేరస్తులు ఈ మీకార్డ్‌ వివరాలను దోచేస్తారు. కాబట్టి ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిజంగానే మీకు ఏదైనా పార్శిల్ వచ్చేది ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను స్పందించాలి. లేదంటే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News