Sabja Seeds: సబ్జా గింజలు ప్రయోజనాలతో పాటు హాని కూడా కలిగిస్తాయి.. అవేంటంటే..?

Sabja Seeds: ఆధునిక జీవితంలో చాలామంది ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Update: 2023-06-13 15:00 GMT

Sabja Seeds: సబ్జా గింజలు ప్రయోజనాలతో పాటు హాని కూడా కలిగిస్తాయి.. అవేంటంటే..?

Sabja Seeds: ఆధునిక జీవితంలో చాలామంది ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొంతమంది బరువు తగ్గడానికి సబ్జా గింజలని వాడుతున్నారు. వీటిని అనేక రకాల పానీయాలు, సలాడ్లు, ఇతర రకాల ఆహారాలతో కలిపి తీసుకుంటున్నారు. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇవి కొంత ప్రతికూల గుణాలని కూడా కలిగి ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. మధుమేహ రోగులు తినకూడదు..

మధుమేహ రోగులు పొరపాటున కూడా సబ్జా గింజలు తినవద్దు. ఎందుకంటే ఇవి ఆరోగ్య సమస్యలని కలిగిస్తాయి. వాస్తవానికి డయాబెటిక్‌ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడానికి మందులు వాడుతుంటారు. సబ్జాగింజలు ఈ మందులకి ప్రతిస్పందించే గుణాలని కలిగి ఉంటాయి. దీనివల్ల శరీరానికి హాని జరుగుతుంది.

2. రక్తం గడ్డకట్టే విషయంలో..

శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావం ఆగిపోతుంది. అయితే సబ్జాగింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిస్తుంది.

3. అజీర్ణం

సబ్జాగింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. ఎందుకంటే వీటిలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా జీర్ణం కావు. ఈ పరిస్థితిలో జీర్ణవ్యవస్థ గందరగోళంగా తయారవుతుంది.

Tags:    

Similar News