Skin glow: స్కిన్ గ్లో పెంచే బియ్యం పిండి
Skin glow: బియ్యం పిండి లో వుండే గరుకుదనం వల్ల చర్మం మీద వుండే మృత కణాలు తొలిగిస్తుంది
Skin Glow: మన దేశంలో బియ్యంతో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, వడియాలు తయారు చేస్తూ వుంటారు. కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగానే కాకుండా సౌందరయ్య పోషనకు కూడా ఉపయోగించవచ్చు ఎలానో "లైఫ్ స్టైల్" లో చూద్దా
బియ్యం పిండి లో వుండే గరుకుదనం వల్ల చర్మం మీద వుండే మృత కణాలు తొలిగిపోతాయి. చర్మంపై గల స్వేద రంద్రాలలోని మురికిని మరియు క్రిములను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది.
పొడి చర్మం కలిగిన వారు బియ్యం పిండి రెండు స్పూన్లు, పెరుగు ఒకటిన్నర స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్ తీసుని వాటిని పేస్టుల కలిపి మొహం మీద సర్క్యలర్ మోషన్ లో తప్పుతూ రాసుకోవాలి. మెడ మీద, చేతుల మీద కూడా రాసుకోవచ్చు. మాస్క్ ఆరాక గట్టిగా అయిపయ ముఖానికి పట్టేసినట్లు అవుతుంది. అందుకే ఈ మాస్క్ వేసుకున్నపుడు నవ్వడం, మాట్లాడటం, తినడం లాంటివి చేయకూడదు. తరువాత 4 గంటల వరకు సోప్ ఉపయోగించ కూడదు. మాస్క్ తీయగానే ఆ ప్రదేశంలో చేతితో తాకి చూస్తే స్కిన్ చాలా సున్నితంగా జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు(ఎండ, చలి) తీసుకోవాలి.
ఒక గిన్నెలో ఒక టేబుల్‌స్పూన్ బియ్యప్పిండి, ఒక టేబుల్‌స్పూన్ అలొవెరా జెల్, ఒక టేబుల్‌స్పూన్ తేనె వేసి మూడింటిని బాగా కలిపి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. కాసేపయ్యాక ఆ పేస్టును బాగా కలిపి ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.
ఒక గిన్నెలో టేబుల్‌స్పూను బియ్యప్పిండి, అరటిపండు గుజ్జు, అరటేబుల్‌స్పూను ఆముదం వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని కళ్లకింద రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది.
రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, సరిపడా పాలు ఒక గిన్నెలో వేసి ఆ మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి పూతలా రాసుకుని అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌లు తరచుగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ముఖం మరీ కాంతిహీనంగా అనిపిస్తుంటే వారినికి కనీసం రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవాలి. దీనితో ఎక్కువగా మంచి నీళ్ళు తాగుతూ, తాజా పండ్లు, కూరగాలయలు తీసుకుంటే కాంతి వంతమై ముఖవర్చసు మీ సొంతం అవుతుంది.