Dark Circle: కళ్ల కింద నల్లటి వలయాలకి ఇలా చెక్ పెట్టండి..!
Dark Circle: ఈ రోజుల్లో చాలామంది కళ్లకింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు.
Dark Circle: ఈ రోజుల్లో చాలామంది కళ్లకింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి డార్క్ సర్కిల్స్ సమస్య ఎదురవుతుంది. వీటివల్ల అంద విహీనంగా, పెద్దవారిలా కనిపిస్తారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకుంటారు కానీ ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపవని ఆలస్యంగా తెలుసుకుంటారు. అయితే నల్లటి వలయాలను తగ్గించేందుకు కలబంద బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
1. నిమ్మ, కలబంద
నల్లటి వలయాలను తొలగించడానికి కలబంద, నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. 1 గిన్నెలో 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీనిని కళ్ల చుట్టూ సుమారు 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది.
2. బంగాళదుంప, అలోవెరా
అలోవెరా, బంగాళాదుంప పేస్ట్ నల్లటి వలయాలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. 1 టీస్పూన్ బంగాళాదుంప రసం తీసుకొని అందులో 1 టీస్పూన్ అలోవెరా జెల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కళ్లను శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
3. అలోవెరా, రోజ్ వాటర్
డార్క్ సర్కిల్స్ సమస్యను తొలగించడానికి రోజ్ వాటర్, అలోవెరా జెల్ బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ రోజ్ వాటర్ తీసుకొని అందులో 1 టీస్పూన్ అలోవెరా జెల్ కలపాలి. తర్వాత కళ్లపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత కళ్లను శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు.