Protein Types: ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్ అత్యవసరం.. కానీ ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..?
Protein Types: మనం తినే ఆహారంలో ప్రొటీన్ ఉండాలని వైద్యులతో పాటు చాలామంది నిపుణులు చెబుతుంటారు.
Protein Types: మనం తినే ఆహారంలో ప్రొటీన్ ఉండాలని వైద్యులతో పాటు చాలామంది నిపుణులు చెబుతుంటారు. నిజానికి ప్రొటీన్ అనేపేరు తరచుగా వింటారు కానీ అది అంటే ఏమిటీ చాలామందికి తెలియదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్ అత్యవసరం. ఇది లేకుంటే అతడు తొందరగా అనారోగ్యనికి గురై వివిధ రకాల వ్యాధుల బారిన పడుతాడు. ప్రొటీన్ అమైనో ఆమ్లాలతో కూడిన కణజాల వ్యవస్థ. ఎంజైములుగా పనిచేస్తూ శరీరంలో జరిగే రకరకాల చర్యలకు తోడ్పడుతుంది. కానీ చాలామంది రోజుకు తగినంత ప్రొటీన్ తీసుకోవడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రొటీన్ రకాలు, ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పిండి పదార్థం శరీరానికి శక్తిని సమకూరిస్తే కొవ్వు శక్తిని దాచుకొని అవసరమైనప్పుడు తిరిగి అందిస్తుంది. ఈ రెండింటిని సమన్వయం చేసేవి ప్రొటీన్లే. శరీరంలో జరిగే జీవక్రియలు వీటి రూపంలోనే జరుగుతాయి. విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్ వంటివన్నీ ప్రొటీన్లే. అవయవాలు, కండరాలు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, అస్థి పంజరం అన్నీ వీటితో తయారైనవే. మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రొటీన్ పదార్థాలు జీర్ణకోశంలో అమైనో ఆమ్లాలుగా మారి అక్కడి నుంచి కాలేయంలోకి, కణాల్లోకి చేరి ప్రొటీన్లుగా తయారవుతాయి. అయితే కొన్ని రకాల ప్రొటీన్లను బాడీ తయారుచేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది.
చికెన్ మాంసంలో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఇందులో అత్యవసర అమైనో ఆమ్లాలతో పాటు ఐరన్, జింక్, బి విటమిన్లు లభిస్తాయి. అయితే ఉడకబెట్టి తినడం మంచిది. సాల్మన్, మాకెరెల్, సార్‌డైన్స్ వంటి చేపల్లో ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలూ దండిగా లభిస్తాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు, పెరుగు, ఛీజ్‌లతో క్యాల్షియం, విటమిన్ డి అందుతుంది. వెన్న తీసిన పెరుగైతే ఇంకా మంచిది. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా, ప్రొటీన్ దండిగా ఉంటుంది. గుడ్లలో అన్ని రకాల అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయి. మెదడు ఆరోగ్యానికి అవసరమైన కొలీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులైతే చిక్కుళ్లు, బఠానీలు, పప్పులు, టోఫు వంటి సోయా ఉత్పత్తులు.. గింజ పలుకులు, విత్తనాల వంటి వాటిని తీసుకుంటే సంపూర్ణ ప్రొటీన్లు లభిస్తాయి.