Garlic Disadvantages: ఇలాంటి వ్యక్తులు పొరపాటున కూడా వెల్లుల్లి తినకూడదు.. చాలా హానికరం..!
Garlic Disadvantages: వెల్లుల్లి తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది.
Garlic Disadvantages: వెల్లుల్లి తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది. దీని పేస్టుని కూరలలో కలపడం వల్ల రుచిపెరగడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా వెల్లుల్లి గుణం వేడిగా ఉంటుంది. అందుకే దీనిని శీతాకాలంలో ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. అయితే దీనివల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా అప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వెల్లుల్లిని తినకూడదు. వారి గురించి తెలుసుకుందాం.
వెల్లుల్లి తినడం వల్ల కలిగే నష్టాలు
వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. భయము, తల తిరగడం లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి వినియోగాన్ని తగ్గించాలి. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే వెల్లుల్లి తినకూడదని గుర్తుంచుకోండి.
కాలేయం దెబ్బతింటుంది
యాంటీఆక్సిడెంట్స్ అనే మూలకం వెల్లుల్లిలో ఉంటుంది. దీని కారణంగా కాలేయంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఈ పరిస్థితిలో వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి దీనిని సరైన పరిమాణంలో తీసుకోవడం మంచిది.
గ్యాస్-ఎసిడిటీ
గుండెల్లో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్న వ్యక్తులు వెల్లుల్లి వినియోగాన్ని తగ్గించాలి. లేదంటే ఛాతీలో మంట, నొప్పి సమస్యలు మరింత పెరుగుతాయి.
వాంతులు, విరేచనాలు
వాంతులు, విరేచనాలతో బాధపడేవారు వెల్లుల్లిని అస్సలు ఉపయోగించకూడదు. దీని వేడి ప్రభావం కారణంగా కడుపులో మంటని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.