Heart Patients: గుండె వ్యాధులు ఉన్నవారు తక్కువ నీరు తాగాలి.. ఎందుకంటే..?

Heart Patients: మనిషి నీరు తాగకుండా ఉండలేడు. శరీరంలో అత్యధిక భాగం నీటితోనే నిండి ఉంటుంది. మంచి ఆరోగ్యానికి నీరు తాగడం చాలా అవసరం.

Update: 2024-01-04 01:30 GMT

Heart Patients: గుండె వ్యాధులు ఉన్నవారు తక్కువ నీరు తాగాలి.. ఎందుకంటే..?

Heart Patients: మనిషి నీరు తాగకుండా ఉండలేడు. శరీరంలో అత్యధిక భాగం నీటితోనే నిండి ఉంటుంది. మంచి ఆరోగ్యానికి నీరు తాగడం చాలా అవసరం. రోజులో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారికి ఈ నిబంధన పనిచేయదు. వీరు తక్కువ నీరు తాగాలని నిపుణులే చెబుతున్నారు. కారణమేంటో ఈ రోజు తెలుసుకుందాం.

తక్కువ నీరు ఎందుకు తాగాలి..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం గుండె రోగులు ఎక్కువ నీరు తాగకూడదు. నీరు మాత్రమే కాదు వీరు ఏ పానీయాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే హృద్రోగులు ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నీరు స్టోర్‌ అవుతుంది. ఇది కాళ్లు, తొడలు, నడుము వాపునకు కారణమవుతుంది. దీని కారణంగా గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అంతే కాదు ఊపిరిత్తులలో నీరు చేరే అవకాశం పెరుగుతుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.

ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి..?

నిజానికి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. కానీ హృద్రోగులు చలికాలంలో రోజుకు ఒకటిన్నర లీటరు నీరు మాత్రమే తీసుకోవాలి. వేసవి కాలంలో కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. అలాగే హృద్రోగులు నీటిని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా తాగాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల గుండె మరింత కష్టపడాల్సి ఉంటుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటాడు.

డీ హైడ్రేషన్‌ సమస్య

6 నెలల పాటు శరీరంలో నిరంతర నీటి కొరత ఉంటే అది దీర్ఘకాలిక హైపోటెన్షన్ సమస్యకు దారితీస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే హైపోటెన్షన్ అనేది తక్కువ రక్తపోటుకు సంబంధించినది. శరీరంలో నీటి లోపం 2 నుంచి 5 శాతం మధ్య ఉంటే దానిని తేలికపాటి డీహైడ్రేషన్ అంటారు. 5 శాతం కంటే ఎక్కువ నీరు పోతే దానిని క్రానిక్ డీహైడ్రేషన్ అంటారు.

Tags:    

Similar News